Begin typing your search above and press return to search.
దిల్ రాజుతో బేరమాడుతున్న ఓటీటీలు...!
By: Tupaki Desk | 1 May 2020 7:30 PM ISTకరోనా మహామ్మరి కారణంగా ప్రపంచమంతా లాక్ డౌన్‌లో వుంది. దీంతో సినిమా పరిశ్రమ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. థియేటర్లు మూసివేయడం.. చిత్రీకరణ ఆగిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోంభంలో వుంది. ఇంట్లోనే ఉండటంతో ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అయినటువంటి అమేజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్, ఆహా, జీ5 లలో సినిమాలు వీక్షిస్తున్నారు. ఇక థియేటర్లు ఎప్పుడూ ఓపెన్ అవుతాయో తెలియని స్థితి కారణంగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'అమృతరామమ్' అనే చిన్న సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఆన్ లైన్ లో రిలీజైన మొట్టమొదటి తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పించిన ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం జీ 5 లో విడుదలైంది. అయితే ఈ చిత్రం బ్యాడ్ టాక్… రివ్యూలను పొందింది. దీని ఫలితంగా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయని సమాచారం. దీంతో చిన్న సినిమాలు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తే లాభం లేదని భావించిన ఓటీటీ సంస్థలు పెద్ద సినిమాలను ఓటీటీలలో పెట్టాలని భావిస్తున్నాయట. క్రేజీ మూవీస్ అయితే ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి.. దీంతో వ్యూస్ కూడా ఎక్కువ వచ్చి లాభాలు వస్తాయని ఆలోచిస్తున్నారట.
ఈ నేపథ్యంలో ఓటీటీల కన్ను ఇప్పుడు నాని - సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న ‘వి’ సినిమా మీద పడిందట. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. దిల్ రాజు ఈ సినిమా రైట్స్ ను 35 కోట్ల ధరలకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడట. ‘వి’ సినిమా స్ట్రీమింగ్ హక్కులను పొందటానికి అమెజాన్ ప్రైమ్ నిర్మాత దిల్ రాజుతో చర్చలు జరుపుతోందట. అయితే దీనికోసం అమెజాన్ ప్రైమ్ 20 కోట్ల మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉందట.. అలాగే మొదటి వారం రన్ తర్వాత 'పే ఫర్ అవర్' మోడల్ ప్రకారం చెల్లిస్తారట. ఫస్ట్ వీక్ తర్వాత సినిమా ఎక్కువ మొత్తంలో వసూల్ చేయకపోవచ్చు. కాబట్టి 35 కోట్ల డిమాండ్ పై మాత్రమే దిల్ రాజు ఆసక్తిగా ఉన్నారట. ‘వి’ సినిమా మార్చి 25 న ఉగాదికి విడుదల చేయాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఒకవేళ ఈ డీల్ కుదిరితే మాత్రం ఇది సెన్సేషనల్ కావడం ఖాయమని చెప్పొచ్చు. అంతేకాకుండా మరిన్ని పెద్ద సినిమాలు డైరెక్టుగా ఆన్ లైన్ లో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనుష్క 'నిశ్శబ్దం' సినిమా కూడా ఆన్ లైన్ లో డైరెక్టుగా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాతలు గానీ అమెజాన్ గానీ ఇంతవరకూ స్పందించలేదు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కి ముందుకు వస్తాయో చూడాలి.