Begin typing your search above and press return to search.

కె.జీ.ఎఫ్ -2: జస్ట్ నాన్ థియేట్రికల్స్ తోనే బ్రేక్ ఈవెన్?

By:  Tupaki Desk   |   4 May 2020 6:30 AM GMT
కె.జీ.ఎఫ్ -2: జస్ట్ నాన్ థియేట్రికల్స్ తోనే  బ్రేక్ ఈవెన్?
X
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన కన్నడ చిత్రం 'కె.జి.ఎఫ్: 1' 2018 లో విడుదలై దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. ఒక కన్నడ సినిమా పలు భాషలలో విడుదల కావడం.. విడుదలైన అన్ని భాషలలో సంచలన విజయం నమోదు చెయ్యడంతో ఒక్కసారిగా అందరి దృష్టి కన్నడ చిత్రసీమపై పడింది. మొదటి భాగం అసాధారణ విజయం సాధించడంతో రెండవ భాగం 'కె.జి.ఎఫ్: 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు క్రేజీ బిజినెస్ డీల్స్ వస్తున్నాయని సమాచారం అందుతోంది. డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడానికి ప్రముఖ ఓటీటీ ప్లేయర్లు పోటీపడుతున్నాయట. ఈ సినిమా మొదటి భాగం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రెండవ భాగం డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు ప్రశాంత్ నీల్ టీమ్ ముందు ఓ భారీ ఆఫర్ పెట్టారని సమాచారం. ఈ సినిమాకు అయ్యే మొత్తం బడ్జెట్ లో 60% ఎమౌంట్ ను ఇస్తామనే క్రేజీ ఆఫర్ తో ముందుకు వచ్చారట.

ఈ సినిమాను ప్రశాంత్ నీల్ టీమ్ షుమారుగా 80 కోట్లతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసింది. అమెజాన్ వారి ఆఫర్ ప్రకారం 54 కోట్లు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారానే నిర్మాతల జేబుల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇదే జరిగితే మిగతా ఎమౌంట్ ను ఇతర నాన్-థియేట్రికల్ రైట్స్ అయిన శాటిలైట్ రైట్స్.. మ్యూజిక్ రైట్స్ లాంటి వాటితో రాబట్టుకోవచ్చని అంటున్నారు. అంటే.. ఈలెక్కన జస్ట్ నాన్ - థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని.. థియేట్రికల్ రైట్స్ మీద వచ్చేదంతా లాభమని మార్కెట్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.