Begin typing your search above and press return to search.

అమెరికా బియాండ్ ఫెస్ట్ లో జ‌క్క‌న్న క‌ళాఖండాలు!

By:  Tupaki Desk   |   8 Sep 2022 8:34 AM GMT
అమెరికా బియాండ్ ఫెస్ట్ లో జ‌క్క‌న్న క‌ళాఖండాలు!
X
గ్లోబ‌ల్ స్థాయిలో ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజ‌మౌళి ఇప్ప‌టికే ఖ్యాతికెక్కారు. 'ఈగ'.. 'బాహుబ‌లి' ప్రాంచైజీతోనే జ‌క్క‌న్న వ‌ర‌ల్డ్ లో ఓ వెలుగు వెలిగారు. ఆ చిత్రాల‌కు గానూ అంత‌ర్జాతీయ స్థాయిలోనూ అవార్డులు..రివార్డ‌లు అందుకున్నారు. ఆసియా ఖండం ఫిల్మ్ పెస్ట్ వ‌ల్స్ లోనూ జ‌క్క‌న్న మారు మ్రోగారు. ఇటీవ‌లే రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' ఆయ‌న స్థాయి రెట్టింపు అయింది.

ఆర్ ఆర్ ఆర్ కూడా గ్లోబ‌ల్ రేంజ్ రీచ్ అవుతుందా? అన్న మీమాంస‌కి ఆ సినిమా తెర తీసింది. అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ హిందీ లో రీ రిలీజ్ అవ్వ‌డం...నెట్ ప్లిక్స్ లో వ‌ర‌ల్డ్ వైడ్ ప్రేక్ష‌కుల్ని స‌హా సినిమా నిపుణుల్ని సైతం ముక్కున వేలేసేకునేలా చేసిందా చిత్రం. క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ తో పాటు..ఆర్ ఆర్ ఆర్ కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.

హాలీవుడ్ మేక‌ర్స్ సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది. రామ్ చ‌ర‌ణ్ కి ఏకంగా హాలీవుడ్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌న్నా?ఎన్టీఆర్ ఆస్కార్ రేసులో నిలుస్తున్నాడు? అన్న దాని వెనుక కార‌ణం కేవ‌లం జ‌క్క‌న్న అన్న‌ది గుర్తించాల్సిన విష‌యం. మ‌రి ఈ లెజెండ్ కి ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

అమెరికాలో జ‌రిగే ప్ర‌ఖ్యాత‌ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలు ప్ర‌ద‌ర్శ‌న‌కి ఎంపిక‌య్యాయి. హాలీవుడ్ లో జ‌రిగే అతిపెద్ద ఫిల్మ్ పెస్టివ‌ల్స్ లో బియాండ్ ఫెస్ట్ ఒక‌టి. ఈ ఫెస్ట్ కి భారీ సంఖ్య‌లో ప్రేక్ష‌కులు వ‌స్తారు. సెప్టెంబ‌ర్ 17 నుంచి ఆక్టోబ‌ర్ 11 వ‌ర‌కూ జ‌రిగే ఈ వేడుక‌ల్లో జ‌క్క‌న్న హిట్లు కొన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

దీనికి సంబంధించి నిర్వాహ‌కులు ఓ పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో రాజ‌మౌళి అనే పేరులోనే ఆయ‌న హిట్ సినిమాల పాత్ర‌ల్ని కొన్నింటిని క్రియేటివ్ గా డిజైన్ చేసి పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. టాలీవుడ్ టూ హాలీవుడ్ అని రివీల్ చేసారు.

సెప్టెంబ‌ర్ 30న ఆర్ ఆర్ ఆర్..అక్టోబ‌ర్ 1న ఈగ‌.. బాహుబ‌లి..అక్టోబ‌ర్ 21న మ‌ర్యాద రామ‌న్న సినిమాలు ప్ర‌ద‌ర్శిస్తారు. ఈవేడుకకు జ‌క్క‌న్న అతిధిగా వెళ్త‌నున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వాహ‌కులు రాజ‌మౌళిని ఘ‌నంగా స‌న్మానించ‌నున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.