Begin typing your search above and press return to search.

అమర్ అక్బర్ అందుకు సిద్ధం!

By:  Tupaki Desk   |   26 Oct 2018 5:10 AM
అమర్ అక్బర్ అందుకు సిద్ధం!
X
ఒక్కోసారి అంతే.. మనం పని చేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. కారణాలు ఏవైనా ఉండొచ్చుగానీ మాస్ మహారాజా రవితేజ దర్శకుడు శ్రీను వైట్ల ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. దాంతో ఇద్దరూ కలిసి పనిచేస్తున్న 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాపై ఆ ఇంపాక్ట్ కాస్త పడింది. పోస్టర్లు రిలీజ్ చేస్తున్నా సినిమాపై మేకర్స్ ఆశించినంతగా బజ్ రావడంలేదు. దీనికి తోడు రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న సందిగ్ధత కూడా ఆడియెన్స్ లో కన్ఫ్యూజన్ పెంచుతోంది.

అందుకే ఈ సినిమాపై ఆసక్తి పెంచేందుకు వైట్ల టీమ్ రెడీ అవుతోంది. టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకుంటున్నారట. అక్టోబర్ 29 న ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రవితేజ మూడు పాత్రలకు మూడు టీజర్లు ప్లాన్ చేశారో ఏమో గానీ అందులో వైవిధ్యం లేకపోతే రవితేజ మూడు పాత్రల పోస్టర్స్ కు వచ్చిన రెస్పాన్స్ కు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు.

మరి టీజర్ తో ఈ సినిమాపై కొంతమందికి ఉన్న అనుమానాలనూ పటాపంచలు చేస్తారా.. మాస్ రాజా - వైట్లలు అందరినీ ఒకే దెబ్బకు మడతెడతారా అనేది వేచి చూడాలి. కమెడియన్ అలీ స్టైల్ లో చెబితే మాస్ రాజా-వైట్ల కాట్రవల్లి జలగండ్రికి మీరు రెడీనా?