Begin typing your search above and press return to search.
ఈవీవీ గారి వల్లనే నా లైఫ్ టర్న్ అయింది: ఆమని
By: Tupaki Desk | 31 Aug 2021 7:38 AM GMTతెలుగులో నిన్నటి తరం కథానాయికలలో ఆమని ఒకరు. 'జంబలకిడి పంబ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆమని, ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. అందం .. అందుకు తగిన అభినయంతో అభినందనలు అందుకుంటూ తన కెరియర్ ను కొనసాగించారు. బాపు .. కె విశ్వనాథ్ వంటి గొప్ప దర్శకులచే ప్రశంసలు అందుకున్నారు. కమలహాసన్ వంటి గొప్పనటుడితో కలిసి నటించారు. అలాంటి ఆమని తాజాగా ఇంద్రజతో కలిసి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేదికపై ఆమని మాట్లాడుతూ .. "నా అసలు పేరు మంజుల. తమిళ సినిమాల్లో మీనాక్షి పేరుతో నటించాను. తెలుగులో నా మొదటి సినిమా 'ఆడది'. ఆ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేశాను. హీరోయిన్ గా చేసిన మొదటి చిత్రం 'జంబలకిడి పంబ'నే. ఈ సినిమా నుంచే నా పేరు ఆమని అని ఈవీవీ గారు మార్చేశారు. ఆ సినిమా నుంచి నా లైఫ్ మారిపోయింది. పెద్ద పెద్ద దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. మిగతా భాషల్లోను కలుపుకుని హీరోయిన్ గా ఓ 90 సినిమాలు చేసి ఉంటాను.
ఇండస్ట్రీకి వచ్చిన తరువాతనే నేను .. ఇంద్రజ .. సౌందర్య మంచి స్నేహితులమయ్యాము. ఇంద్రజతో కలిసి 'అమ్మదొంగ' సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో గ్లామరస్ గా కనిపించే పాత్ర కోసం ఇంద్రజను అనుకున్నారు. కాస్త పద్ధతిగా కనిపించే పాత్ర కోసం నన్ను అనుకున్నారు. కానీ గ్లామరస్ పాత్రలో మోడ్రన్ గా కనిపించే పాత్రలో నేను చేస్తానని పట్టుబట్టడంతో, ఇంద్రజ కోసం అనుకున్న పాత్రను నాకు ఇచ్చారు. ఈ విషయం ఆమెకి కూడా తెలియదు. 'అమ్మదొంగ' సినిమా అప్పుడు డాన్స్ చేయాలంటే నేను టెన్షన్ పడిపోయేదానిని. నేనే అంటే సౌందర్య నా కంటే ఎక్కువగా కంగారు పడిపోయేది.
'జంబలకిడి పంబ' సినిమా కోసం ఫోటోలు పంపించాను .. ఆడిషన్స్ కోసం రమ్మన్నారు. మరుసటి రోజు వెళదామని అనుకున్నాను. కానీ హఠాత్తుగా మా నాన్నగారు చనిపోయారు. దాంతో నేను ఆ బాధను తట్టుకోలేకపోయాను. ఆడిషన్స్ కి వెళ్లే ఆలోచనను మానుకున్నాను. కానీ మా అమ్మ నాకు ధైర్యం చెప్పి పంపించింది. అప్పుడు నేను వెళ్లి ఆడిషన్స్ లో పాల్గొన్నాను. ఆ తరువాత ఈవీవీ గారు ఓకే చెప్పేయడం .. ఆ సినిమా చేయడం జరిగిపోయింది.
నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి. శ్రీదేవి .. జయసుధ .. జయప్రద సినిమాలు ఎక్కువగా చూసేదానిని. ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచన చేస్తూ ఉండేదానిని. సినిమాలంటే అంత ఇష్టంతో వచ్చినందుకు వల్లనే, ఒకే ఏడాదిలో నేను 11 సినిమాలు చేయగలిగాను. ఆ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో 'బాపు' గారి 'మిస్టర్ పెళ్ళాం' సినిమా నాకు మంచి పేరుతో పాటు, ఫస్టు టైమ్ నంది అవార్డును తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.