Begin typing your search above and press return to search.

ఢిల్లీ రైత‌న్న‌కు మ‌ద్ద‌తుగా.. అమండా బికినీ ఫొటో షూట్‌..!!

By:  Tupaki Desk   |   10 Feb 2021 9:30 AM GMT
ఢిల్లీ రైత‌న్న‌కు మ‌ద్ద‌తుగా.. అమండా బికినీ ఫొటో షూట్‌..!!
X
నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా భార‌త రైత‌న్న చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు దేశ‌, విదేశాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్ప‌టికే సెల‌బ్రిటీలు.. భారీ ఎత్తున మోడీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అమెరికా, బ్రిట‌న్ స‌హా అనేక దేశాల నుంచి రైతుల‌కు మ‌ద్ద‌తుగా.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా.. వివిధ రూపాల్లో కామెంట్లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు సెల‌బ్రిటీలు విభిన్న శైలిలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ప్ర‌ముఖ అమెరిక‌న్ యూట్యూబ‌ర్ అమండా సెర్నీ.. బికినీ ఫొటో షూట్‌తో రైతుల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. అమండా ప్ర‌య‌త్నం.. ఇప్పుడు భారీ ఎత్తున వైర‌ల్ అవుతోంది.

అమండా బికినీ ధ‌రించి.. పొలాల్లో ఫొటోల‌కు స్టిల్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు.. ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌క్తీక‌రించిన అభిప్రాయాల‌కు భిన్నంగా ఉండ‌డంతో ఇప్పుడు అంద‌రి చూపూ అమండా వైపే ప‌డింది. కాగా, ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ రిహ‌న్నా, మాజీ పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా కూడా రైతుల‌కు మ‌ద్ద‌తు తెలిపిన విష‌యం తెలిసింది. ఇక‌, ఈ ఫొటోల్లో .. బికినీ ధ‌రించిన అమండా.. భార‌త రైతుల‌కు మ‌ద్ద‌తుగా తానీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించి.. అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్త‌డం విశేషం. పొలాల మ‌ధ్య‌న‌, ట్రాక్ట‌ర్‌పై నిల‌బ‌డి అమండా ఇచ్చిన స్టిల్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

ఇక‌, అమండా ఈ ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసి.. ``రైతు లేక‌పోతే.. అన్నం లేదు`` అని ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచిన సెల‌బ్రిటీల‌పై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పించారు. వారంతా డ‌బ్బు తీసుకుని కామెంట్లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, అమండా ఇక్క‌డితో ఆగ‌కుండా.. మోడీ స‌ర్కారుపైనా విమ‌ర్శ‌లు గుప్పించింది. మోడీ ప్ర‌భుత్వం మాన‌వ హ‌క్కుల‌ను కాల‌రాస్తోంద‌ని.. ఇంట‌ర్నెట్ తొల‌గించ‌డం దీనిలో భాగ‌మేన‌ని పేర్కొంది. ఇదిలావుంటే.. త‌మ‌పై సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక కామెంట్లు వ‌చ్చినా కూడా తాము మాత్రం రైతుల వెంటే ఉంటామ‌ని.. వారికి మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని.. మియా ఖ‌లీఫా, అమండా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.