Begin typing your search above and press return to search.

స‌న్నీలియోన్ కే అక్క‌లా ఏమిటా భంగిమ‌లు అమ్మ‌డూ?

By:  Tupaki Desk   |   25 Oct 2020 8:00 AM IST
స‌న్నీలియోన్ కే అక్క‌లా ఏమిటా భంగిమ‌లు అమ్మ‌డూ?
X
ఇండో కెన‌డియ‌న్ బ్యూటీ స‌న్నీలియోన్ శృంగార సామ్రాజ్యంలో రారాణిగా వెలిగిపోయిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ స‌త్తా చాటాక బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్క‌డా ఓ సీజ‌న్ ని ఏలింది. కేవ‌లం త‌న‌కోస‌మే క‌థ‌లు రాసి సినిమాలు తీసే రేంజు చూపించిందంటే స‌న్నీ ట్యాలెంట్ ని ప్ర‌శంసించి తీరాలి. శృంగార తార అన్న ముద్ర మిన‌హా ఎందులోనూ ఇత‌ర స్టార్ హీరోయిన్ల‌కు తాను త‌క్కువ కాద‌ని నిరూపించింది స‌న్నీ.

అయితే ఆమె స‌న్నీలియోన్ త‌ర‌హా కాదు కానీ.. సోష‌ల్ మీడియాల్లో జోష్ తో ఉండే యువ‌త‌రానికి బాగా క‌నెక్ట‌యిపోయిన ఈ అమ్మ‌డి పేరు అంత‌కంత‌కు వైర‌ల్ గా మారుతోంది. ఈ భామ పేరు అమండా సెర్నీ. అమెరిక‌న్ వ్లాగ‌ర్. అమండా సెర్నీ? ఎవ‌రు అన్న‌ది ప‌రిశీలిస్తే..

నటి.. మోడల్.. హెల్త్ వ్లాగ‌ర్ అని తేలింది. అమండా సెర్నీకి యూట్యూబ్,... ఫేస్‌బుక్.. ఇన్ ‌స్టాగ్రామ్ ‌లలో 45 మిలియన్ల(నాలుగున్న‌ర కోట్ల‌)కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన మొదటి ఐదు ఇన్ ‌స్టాగ్రామ్ స్టోరీ ఖాతాలలో ఒకటిగా అమండా ఖాతా స్థానాన్ని సంపాదించింది. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే నెలకు 1.3 మిలియన్లకు పైగా కొత్త అనుచరులతో... అమండా దూసుకెళుతోంది.

స్టోరీలు చెప్పే ట్యాలెంటుతో పాటు ..అధిక-నాణ్యత వీడియోల ద్వారా ప్రజలను ఉత్తమంగా అనుభవించడంలో సహాయపడే ఒక మిషన్ ‌లో అగ్ర కంటెంట్ సృష్టికర్త గా అమండా పేరు మార్మోగుతోంది. అన్న‌ట్టు ఈ అమ్మ‌డు ఇన్ స్టాలో స‌న్నీలియోన్ కే అక్క‌లా ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో హీటెక్కించేస్తుంటే అవ‌న్నీ జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి. ఇప్ప‌టికే ఇండియ‌న్ సినిమాపై ఈ అమ్మ‌డి క‌న్ను ప‌డింద‌ట‌. హిందీ తెలుగు త‌మిళ బెల్టులో అవ‌కాశాలొస్తే న‌టించేందుకు సిద్ధ‌మేన‌ట‌.