Begin typing your search above and press return to search.

ధ్యానం ప్రార్థ‌న మ‌రో లోకంలో విహ‌రిస్తున్న పాల్

By:  Tupaki Desk   |   6 April 2021 8:00 AM IST
ధ్యానం ప్రార్థ‌న మ‌రో లోకంలో విహ‌రిస్తున్న పాల్
X
గ‌త ఏడాది కాలంగా అందాల క‌థానాయిక అమలాపాల్ అంత‌కంత‌కు దైవ‌చింత‌న‌తో ఆధ్యాత్మిక భావ‌న‌ల‌కు చేరువ‌వ్వ‌డం చూస్తున్న‌దే. ఇటీవ‌ల కేర‌ళ ప‌చ్చందాల న‌డుమ అమ‌లాపాల్ విహార‌యాత్ర‌ల్లో మెడిటేష‌న్ యోగా క్లాసెస్ ప్ర‌ధాన భాగం అయ్యాయి. ఆధ్యాత్మిక చింత‌న ధ్యానం గురించి అభిమానుల‌కు అమలా నిరంత‌రం అవేర్ నెస్ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇప్ప‌టికీ అన్ లిమిటెడ్ గా అమ‌లాపాల్ నుంచి ఏదో ఒక సందేశం అందుతూనే ఉంది. తాజాగా ప్రార్థ‌న వ‌ల్ల డివైనిటీ మెడిటేష‌న్ వ‌ల్ల ప్ర‌శాంత‌త ఎలా క‌లుగుతాయో వివ‌రిస్తూ అందుకు సంబంధించిన సాధ‌న‌ను ప‌రిచ‌యం చేసారు.

అమ‌లాపాల్ ఒక విచిత్ర‌మైన గ్రాఫిటీ క‌ళ‌తో రూపొందించిన‌ ఆశ్ర‌మంలో ఇలా త‌ప‌స్సునాచ‌రిస్తూ ప్ర‌త్య‌క్షమ‌య్యారు. ఆ ఆశ్ర‌మం అంత‌టా విచిత్ర‌మైన ఆకృతితో డివైనిటీని ఎలివేట్ చేసే ప‌రిస‌రాల్ని త‌ల‌పిస్తోంది. అక్క‌డ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో అమ‌లాపాల్ ఫోటోషూట్ రొటీన్ కి భిన్నంగా సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటోంది.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ పాల్ కెరీర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రం. అమ‌లాపాల్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ల‌స్ట్ స్టోరీస్ రీమేక్ పిట్ట‌క‌థ‌లు లో అమ‌లాపాల్ న‌టించారు. మ‌ల‌యాళంలో ఆడుజీవితం .. ప‌ర‌న్ను ప‌ర‌న్ను ప‌ర‌న్ను .. త‌మిళంలో అంధ ప‌ర‌వై పోలా ... క‌డ‌వ‌ర్ అనే చిత్రాల్లో న‌టిస్తున్నారు.