Begin typing your search above and press return to search.
'వైల్డ్ డాగ్' ట్రైలర్ కు అమల స్పందన ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 16 March 2021 5:30 PM GMTనాగార్జున హీరోగా రూపొందిన వైల్డ్ డాగ్ సినిమా విడుదలకు ముస్తాబయ్యింది. ఏప్రిల్ 2వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ ఏజెంట్ గా కనిపించబోతున్నారు. మొదటి నుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అక్కినేని అభిమానులు ఏడాది కాలంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించారు. ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్ కు వస్తున్న స్పందన గురించి నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడారు.
వైల్డ్ డాగ్ ప్రమోషన్ లో భాగంగా నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మహేష్ బాబు ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు. ఇంకా చాలా మంది పాజిటివ్ గా స్పందించారు. ఇక అమల ట్రైలర్ చూసిన తర్వాత వెంటనే మెసేజ్ చేసింది. అందులో 10 ముద్దు ఈమోజీలు.. 10 హార్ట్ ఈమెజీలు.. ఇంకా స్టార్ ఈమోజీలు ఉన్నాయి. తనకు ట్రైలర్ బాగా నచ్చిందన్నారు. సినిమా కోసం యూనిట్ సభ్యులం అంతా కూడా చాలా కష్టపడ్డట్లుగా చెప్పుకొచ్చారు.
కరోనా పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు. ఆర్మీ ఆపరేషన్ సన్నివేశాలను అత్యంత సహజ సిద్దంగా తీసేందుకు ప్రయత్నించినట్లుగా నాగ్ పేర్కొన్నాడు. ఒక రియల్ మేజర్ ను ఎన్‌ఐఏ ఆపరేషన్ సన్నివేశాల కోసం ఎంపిక చేసుకుని ఆయన వద్ద సలహాలు తీసుకున్నామన్నారు. కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయినా ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.