Begin typing your search above and press return to search.
అమలాపాల్ సీక్రెట్ డేటింగ్ నిజమా?
By: Tupaki Desk | 10 March 2020 4:04 PM GMTప్రేమ.. పెళ్లి.. విడాకులు .. అంతా ఏడాది రెండేళ్ల స్పాన్ లోనే. మోడ్రన్ ఫ్యామిలీస్ .. సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో ఇదో ట్రెండ్ గా మారింది. అభిప్రాయ భేధాలు వస్తే ఇక ఫ్యామిలీ లైఫ్ గల్లంతేనని ప్రూవ్ అవుతోంది. ఇక అదే కోవలో అమలాపాల్ విడాకుల వ్యవహారం తెలిసిందే. ఆ తర్వాత కథంతా తెలిసిందే. ఇప్పుడు ఈ కథలో మరో కొత్త పేరు చేరింది. ఇంతకీ ఎవరాయన? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
అమలాపాల్ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారనేది తాజా అప్ డేట్. పంజాబీ కుర్రాడు భవీందర్ సింగ్ తో అమలా చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేస్తోందట. నిజానికి ఈ ఇద్దరు 2017 నుంచే డేటింగ్ లో ఉన్నారు. కానీ అంతా గుట్టు చప్పుడు కాకుండానే. చాలా రహస్యంగా రొమాంటిక్ లైఫ్ ని లాగించేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఇన్ స్టా పోస్ట్ ఆజ్యం పోసింది. ఇదే రకరకాల సందేహాలకు కారణమైంది. ``నా ప్రేమైనా నీ పట్ల నేను ఎంతో గర్వపడుతున్నా. నీవు ఎప్పటిలాగే ఆడియెన్స్ ని అలరించడంలో మరింత ముందుకు సాగాలి`` అంటూ భవిందర్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమను కురిపిస్తూ... అమలాపాల్ తో దిగిన ఫొటోని పంచుకున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ప్రియుడితో విహారమా? అంటూ.. అమలాపాల్ పై నెటిజనులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఇక అమలాపాల్ విడాకుల వ్యవహారం తెలిసిందే. తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ని ప్రేమంచి పెళ్ళి చేసుకున్న అమలా పాల్ కాపురంలో కొద్దిరోజులకే కలతలు ఎదురయ్యాయి. అటుపై విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత హీరో విష్ణు విశాల్ కి అమలా సన్నిహితంగా మెలుగుతోంది అంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై ఇటీవల విష్ణు విశాల్ స్పందించి ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఏకంగా ఫోటో ప్రూఫ్ తో మరో కొత్త పేరు తెరపైకి రావడం.. అమలాపాల్ ప్రేమలో మునిగితేలుతోందని ప్రచారం సాగడం ఆశ్చర్యపరుస్తోంది.
ఇక కథానాయికగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకున్న అమలాపాల్ ప్రస్తుతం తమిళంలో `ఆదో అంధా పారవై పోలా`- `కేడవర్`.. చిత్రాలు చేస్తోంది. మలయాళంలో `ఆడుజీవితమ్`.. తెలుగులో `లస్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్ రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉంది.