Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బ్రాండ్ అంటున్న బోల్డ్ పాప!

By:  Tupaki Desk   |   27 July 2018 6:47 AM GMT
ఫోటో స్టొరీ: బ్రాండ్ అంటున్న బోల్డ్ పాప!
X
కేరళ బ్యూటీ అమలా పాల్ పేరు తెలీని సినీ అభిమానులు సౌత్ లో దాదాపుగా ఉండరు. సినిమాలు మాత్రమే కాకుండా వివాదాలతో కూడా సావాసం చేయడం అమలకు కొత్త కాదు. డైరెక్టర్ AL విజయ్ తో పెళ్లి.. అ తర్వాత విడాకులు, లగ్జరీ కారు టాక్స్ ఎగవేత కేసులో ఆరోపణలు, ఓ తమిళ స్టార్ హీరో తో ఎఫైర్ గాసిప్పులు.. ఒక్కటేంటి.. అమల స్టొరీ రచ్చ రంబోలానే.

వీటన్నిటితో పాటు అమల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అమల ప్రస్తుతం అర్జున్ రాంపాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ డెబ్యూ కి రెడీ అవుతోంది. ఆ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ భామ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపింది. తను రేపు ఓ సొంత బ్రాండ్ ను లాంచ్ చేస్తున్నానని - ఈ బ్రాండ్ కోసం దాదాపు ఓ ఏడాది నుండి జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వస్తున్నానని చెప్పింది. పనిలో పనిగా ఓ హాట్ ఫోటోను అప్లోడ్ చేసింది.

హాట్ ఫోటో అంటే హాటే. చల్లటి హిమాలయాలను క్లీవేజ్ షో తో పుట్టే వేడితో కరిగించాలని ప్లాన్ చేసిందో ఏమో గానీ ఫొటోకు 1.7 లక్షల లైకులు వచ్చి పడ్డాయి. మరి బ్రాండ్ అంటే క్లోతింగ్ బ్రాండా లేకా మరేదైనా కాస్మెటిక్స్ బ్రాండా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అందరూ ఒక్కరోజు ఆగాల్సిందే. పర్వాలేదు.. బ్యూటీ వెయిట్ చేయించినా అందంగా ఉంటుంది.