Begin typing your search above and press return to search.

అది నిజమైతే అమల పంచ్ అదిరినట్లే!!

By:  Tupaki Desk   |   2 Sept 2016 11:25 AM IST
అది నిజమైతే అమల పంచ్ అదిరినట్లే!!
X
ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన అమలాపాల్.. సినిమా సంగతుల కంటే పర్సనల్ వ్యవహారాలతోనే ఈ మధ్య వార్తల్లో నానుతోంది. దర్శకుడు ఏఎల్ విజయ్ తో విడాకులు తీసుకోనున్న వ్యవహారం సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలను వదులుకోక పోవడమే ఇలా విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని.. ఆమె భర్త తరఫువారి వాదన.

ఆ సంగతేమో కానీ.. ఏఎల్ విజయ్ ఈమెకు ఛాన్సులు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడనే టాక్ వినిపించింది. ధనుష్ నిర్మాతగా రూపొందే సినిమా 'వడా చెన్నై'లో తప్పించారని అన్నా.. చివరకు అమలనే తీసుకున్నారు. ఇప్పుడు అదే ధనుష్ తన మామగారైన సూపర్ స్టార్ రజినీకాంత్ తో పా రంజిత్ దర్శకుడిగా మరో సినిమాను నిర్మించనున్నాడు. ఇప్పటికే ఇది అఫీషియల్ కాగా.. ఈ మూవీలో రజినీకి జోడీగా అమలాపాల్ ని తీసుకోనున్నారనే న్యూస్ కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

ఇలాంటి పరిస్థితిలో రజినీకాంత్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడం అంటే.. తను సినిమాలు చేయడంపై కామెంట్స్ చేసే వారికి అమల అదిరిపోయే పంచ్ ఇచ్చినట్లే. ఇదిలా ఉండగా.. రజినీకాంత్-పా రంజిత్ కాంబినేషన్ రిపీట్ కానుండడంతో.. ఇది కబాలి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇది వేరే సినిమా అని కబాలికి సంబంధం లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.