Begin typing your search above and press return to search.

సీతాకోక చిలుక‌లా రెక్క‌లు తెరిచి ఎగిరిన పాల్

By:  Tupaki Desk   |   22 Dec 2020 6:30 AM GMT
సీతాకోక చిలుక‌లా రెక్క‌లు తెరిచి ఎగిరిన పాల్
X
ఇటీవ‌ల గ‌త కొంత‌కాలంగా రెబ‌ల్ బ్యూటీ అమలాపాల్ యోగిని అవ‌తారంలో స‌ర్ ప్రైజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మునుప‌టితో పోలిస్తే త‌న‌లోని ఆధ్యాత్మికత వేదాంతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నిరంత‌రం కేర‌ళ అందాల్లో అదిరిపోయే ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతూ ఆస‌క్తిక‌ర‌మైన కొటేష‌న్లు ఇస్తున్న అమ‌లాపాల్ ఫోటోషూట్లు అభిమానుల్లో వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి.

తాజాగా మ‌రో అదిరిపోయే ఫోటోషూట్ ని ఇన్ స్టా మాధ్య‌మంలో అమ‌లాపాల్ షేర్ చేసింది. ``పాము పొర విప్పిన‌ట్టు.. మళ్లీ అది స్వయం రూపానికి మారడం.. లేదా సీతాకోకచిలుక నుండి వచ్చే కోకన్ లాగా అందమైన పరివర్తన తర్వాత రెక్కలు తెరవడం .. నేను ఇలా రూపాంత‌రం చెందాను`` అంటూ పోయెట్రీ చెప్పింది అమ‌లాపాల్.

``నేను ప్రక్షాళన చేస్తున్నాను.. వైద్యం చేస్తున్నాను.. ఎదుగుతున్నాను.. రూపాంతరం చెందుతున్నాను.. బేషరతుగా ప్రేమిస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికీ చాలా ప్రేమ ఉంది. ఆశీర్వ‌దించండి.. గొప్ప అద్భుతాలు సాధ్యం`` అంటూ ఎమోష‌న్ అయ్యింది పాల్. నిజ‌మే తాను చెప్పిన‌ట్టే పాము పొర విప్పిన‌ట్టు.. సీతాకోక చిలుక రెక్క‌లు విచ్చిన‌ట్టు.. ఆ ఫోటోషూట్ అద‌ర‌హో అనే చెప్పాలి. అమ‌లాపాల్ న‌టించిన ల‌స్ట్ స్టోరీస్ - తెలుగు ఎపిసోడ్ కోసం యూత్ ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తుంటే తాను ఇలా పోయెట్రీతో స‌రిపెట్టేస్తోంది. అమ‌లాపాల్ ప‌లు క్రేజీ సినిమాల‌తోనూ బిజీ కానుంద‌ని స‌మాచారం.