Begin typing your search above and press return to search.

బికినీ అంటే.. సినిమాకు నో చెప్పా!

By:  Tupaki Desk   |   24 July 2018 1:30 AM GMT
బికినీ అంటే.. సినిమాకు నో చెప్పా!
X
అసలు బికినీకి తెలుగు మీనింగ్ తెలుసా? మన సంగతేమో గానీ గూగులమ్మకు కూడా సరిగ్గా తెలీదు.. బికినీని తెలుగులో ఏమంటారంటే.. 'ఈత దుస్తులు' అని చెప్తోంది. ఏంటో ఆన్సర్ అంత కన్విన్సింగ్ గా లేదు. తెలుగులో సరైన పదం ఉంటే ఒకే లేకపోతే ఎవరో ఒకరు ఆ పదాన్ని కనిపెట్టి తెలుగులో పదాల సంఖ్యను పెంచండి. అప్పటిదాకా అమలా పాల్ బికినీ స్టొరీ గురించి చెప్పుకుందాం.

అందమైన అమలా పాల్ గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు కదా. ఆమె తెలుగులో చరణ్ సినిమా 'నాయక్'.. అల్లు అర్జున్ సినిమా 'ఇద్దరమ్మాయిలతో' నాగ చైతన్య సినిమా 'బెజవాడ' లో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఒక్క తెలుగే కాదు సౌత్ లో ఉండే అన్నీ భాషలలో నటించిన ఈ అమ్మడు - లగ్జరీ కారు టాక్స్ ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది కుడా. ఇవన్నీ పక్కన బెడితే ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమవుతోంది. అర్జున్ రాంపాల్ హీరోగా నరేష్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఈ సందర్భంగా తనకు గతంలో వచ్చిన బాలీవుడ్ ఆఫర్ల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తనకు గతంలో హిందీ సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి గానీ వాళ్ళు బికినీ వేసుకోమని చెప్పడంతో వాళ్ళకి మొహం మీదే 'నో' చెప్పానని తెలిపింది. తనకు బికినీ వేసుకోవడానికి అభ్యంతరం లేదట కానీ చెత్త సన్నివేశాల్లో బికినీ వేసుకోమని చెప్పడంతో చిర్రెత్తుకొచ్చి ఆ ఆఫర్లు రిజెక్ట్ చేశాని చెప్పింది. వాళ్ళేం అడిగారో ఈ బ్యూటీకెందుకు కోపం వచ్చిందో గానీ యూత్ అంతా ఈ అమ్మడి బికినీ అవతారాన్ని మిస్సయ్యారు.. ప్చ్!