Begin typing your search above and press return to search.

అబద్దాలాడి దొరికింది. నీతులు చెబుతోంది

By:  Tupaki Desk   |   20 Jan 2018 4:42 PM IST
అబద్దాలాడి దొరికింది. నీతులు చెబుతోంది
X
మల్లూ హీరోయిన్ అమలా పాల్ డబ్బింగ్ చిత్రాలతోనే కాక ఇద్దరమ్మాయిలతో - నాయక్ వంటి డైరెక్ట్ తెలుగు సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈమె తన సినిమాలతోనే కాక తన వ్యక్తిగత జీవితం వల్ల కూడా చాలా సార్లు న్యూస్ లోకి ఎక్కింది.

తమిళ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన ఈమె సంవత్సరం తిరిగెలోపే అతనికి విడాకులు ఇచ్చి ముఖ్యాంశం అయింది. ఇప్పుడు మళ్లీ పన్ను ఎగవేత కేస్ లో పోలీసులకు చిక్కి వార్తల్లోకి ఎక్కింది. ఈమధ్యనే ఒక ఖరీదైన కారును కొని తప్పుడు పాత్రలు సమర్పించి 20 లక్షల పన్ను ఎగ్గొట్టిన కారణంగా కేరళ లో పలు సెక్షన్ల కింద ఈమెపై కేసు నమోదు చేయడం జరిగింది అని తెల్సిన విషయమే. జైలు పాలు కావాల్సి వస్తుందేమో అన్న భయంతో ఈమె స్వయంగా వెళ్లి పోలీసుల వద్దకు వెళ్లి తన తప్పును ఒప్పుకుంది. కాగా ఇంస్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉండే అమలా తన ఫోటోని పోస్ట్ చేసింది.

అంతటితో ఆగకుండా అపార్ధం చేసుకునే వాళ్ళని చేసుకొనివ్వండి మీ గురించి గాసిప్స్ చెప్పుకొనివ్వండి. వారి అభిప్రాయాలతో మనకు సంబంధం లేదు. ఎవరు ఏమన్నా మీ అందాన్ని ప్రతిభని మీరే సందేహించకండి, మీలానే మీరుండండీ అంటూ నీతులు చెప్పుకొచ్చింది. డబ్బులు ఎగ్గొట్టా అని పోలీసుల ముందు చక్కగా తప్పు ఒప్పుకొని సోషల్ మీడియా లో మాత్రం ఫాన్స్ కు నీతులు చెప్తోంది ఈ చిన్నది.