Begin typing your search above and press return to search.

ఈసారి అమ్మానాన్న చెప్పినట్లే వింటా : అమలా

By:  Tupaki Desk   |   1 Nov 2018 1:30 AM GMT
ఈసారి అమ్మానాన్న చెప్పినట్లే వింటా : అమలా
X
తెలుగు - తమిళం - మలయాళంలో హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో తమిళ దర్శకుడు విజయ్‌ ను హీరోయిన్‌ అమలా పాల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న వీరు పెళ్లి కోసం ఇరు కుటుంబాలను బలవంతంగా ఒప్పించారు. మతాలు వేరు అవ్వడంతో రెండు కుటుంబాలు మొదట ఒప్పుకోక పోయినా ఒత్తిడి చేసిన కారణంగా వారు ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే వీరిమద్య మనస్ఫర్థలు రావడం - ఆ తర్వాత విడిపోవడం - విడాకులు తీసుకోవడం అన్నీ చకచక జరిగిపోయాయి.

వీరికి అధికారికంగా విడాకులు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరు కూడా మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఒక వైపు దర్శకుడిగా విజయ్‌ వరుస చిత్రాలను తెరకెక్కిస్తుండగా, అమలా పాల్‌ హీరోయిన్‌ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అమలా పాల్‌ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండవ పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకోను అని చెప్పను, కాని రెండవ పెళ్లి ఇప్పట్లో ఉండదని మాత్రం చెప్పగలను అంది.

మొదటి సారి కుటుంబ సభ్యుల నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లాను. అప్పుడు అంతా అనుకున్నట్లుగా జరగలేదు. మొదటి వివాహం సక్సెస్‌ కాలేదు, నా నిర్ణయం తప్పుడు నిర్ణయం అని నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకే రెండవ పెళ్లి విషయంలో పూర్తి బాధ్యత, నిర్ణయాధికారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చినట్లుగా అమలా పాల్‌ ప్రకటించింది. రెండవ పెళ్లి ఇప్పట్లో చేసుకునే ఉద్దేశ్యం లేదు అంటూనే, తల్లిదండ్రుల సూచన మేరకు రెండవ పెళ్లి చేసుకుంటాను అని, వారు చూపించిన వారిని పెళ్లి చేసుకుంటాను అంటూ అమలా పాల్‌ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం తమిళంతో పాటు, హిందీ సినిమాల్లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. విడాకుల తర్వాత ఈమె తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినా కూడా అది సఫలం కాలేదు.