Begin typing your search above and press return to search.

ఫైనల్ గా అమలకి రెండొచ్చాయి..

By:  Tupaki Desk   |   12 March 2018 11:04 PM IST
ఫైనల్ గా అమలకి రెండొచ్చాయి..
X
యంగ్ కేరళ బ్యూటీ అమలాపాల్ సినిమాల కన్నా ఎక్కువగా కాంట్రావర్షియల్ వార్తలతోనే అందరికి దగ్గరైంది. మ్యారేజ్ లైఫ్ లో అలాగే ఇతర విషయాలలో వివాదాల కారణంగా అమలాపాల్ పెరు ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అయితే ఈ బ్యూటీ తమిళ్ మలయాళం సినిమాలే గాని తెలుగు సైడ్ ఎక్కువగా రాలేదు. ఆ మధ్య నాయక్ - ఇద్దరమ్మాయిలతో బాగానే మెరిసిన అవకాశాలను మాత్రం అందుకోలేదు.

అయితే ఇప్పుడు ఈ కేరళ బ్యూటీకి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వస్తోంది. అసలే మన స్టార్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ గట్టిగా పెంచేయడంతో కొంచెం మిడియామ్ రేట్ లో ఉన్న అమలాపాల్ అయితే బడ్జెట్ కి తగ్గట్టు సెట్ అవుతుందని డేట్స్ అడుగుతున్నారట. కానీ అమలాపాల్ మాత్రం తనకు సెట్ అయ్యే కథలని మాత్రమే సెట్ చేసుకుంటుందట. రీసెంట్ గా రెండు మంచి ఆఫర్స్ దక్కినట్లు తెలుస్తోంది.

మంచు విష్ణు అలాగే నాగార్జున వంటి స్టార్ హీరోలతో త్వరలోనే సినిమా చేయనుంది. మంచు విష్ణు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో దాదాపు ఆమెను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున - నానితో చేయబోయే మల్టి స్టారర్ లో అమలాపాల్ హీరోయిన్ గా సెట్ అయ్యింది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పటికే కథకు తగ్గ నటీనటులను సెలెక్ట్ చేశాడు. ఒక్క నాగార్జున ఆఫీసర్ షూటింగ్ ని పూర్తి చేస్తే త్వరలోనే మల్టీస్టారర్ కథను పట్టాలెక్కించేందుకి నిర్మాత అశ్వినిదత్ సన్నాహకలు చేస్తున్నారు.