Begin typing your search above and press return to search.
అమలా పాల్ హీరోయినని మరిచిపోయింది
By: Tupaki Desk | 28 July 2015 5:06 PM ISTఅమల అంటే ఒకప్పుడు అందరికీ నాగార్జున భార్య మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ నాలుగేళ్ల కిందట అమలా పాల్ తెరంగేట్రం చేశాక మన అమల పేరు నెమ్మదిగా మసకబారి పోవడం మొదలైంది. ఇప్పుడు అమల అనగానే అందరికీ అమలాపాలే గుర్తుకొస్తోంది. తమిళం, మలయాళం, తెలుగు.. ఇలా మూడు భాషల్లో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించిన అమల.. స్టార్ డైరెక్టర్ విజయ్ ను పెళ్లాడి మరింతగా పాపులారిటీ తెచ్చకుంది. ఐతే ఎంత స్టార్ హీరోయిన్ అయినా, చాలామంది ఫేవరెట్ గా మారినా.. ఆమెకు కూడా కొన్ని ఇష్టాలుంటాయి కదా. ఆమె కూడా కొందరంటే పడి చస్తుంది కదా. అలా అమలను ఫ్లాట్ చేసేసిన హీరో హృతిక్ రోషన్.
కహోనా ప్యార్ హైలో హృతిక్ ను చూసి ఫ్లాట్ అయిపోయిన కోట్ల మంది అమ్మాయిల్లో తాను ఒకదాన్నంటోంది అమల. ఎప్పటికైనా హృతిక్ ను కలవాలన్నది ఆమె కోరికట. హీరోయిన్ అయ్యాక కూడా ఆ అవకాశం దక్కలేదట. ఐతే ఈ మధ్య ఓ అవార్డు ఫంక్షన్ సందర్భంగా అనుకోకుండా అమలకు ఎదురు పడ్డాడట హృతిక్. అంతే అమ్మడికి దిమ్మదిరిగిపోయింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టిందట. తర్వాత తనెవరో పరిచయం చేసుకుని.. హృతిక్ తో వరుసబెట్టి సెల్ఫీలు దిగేసింది అమల. ‘‘ఓ అవార్డు ఫంక్షన్ తర్వాత పార్టీలో హృతిక్ ఎదురు పడ్డాడు. నేను హృతిక్ కు చాలా పెద్ద ఫ్యాన్. హీరోయిన్ అని మరిచిపోయి ఆయన ముందు వీరాభిమానిలాగే ప్రవర్తించాను. ఆయన్ని చూడగానే నాకు మతి భ్రమించినట్లయింది. కహోనా ప్యార్ హై సినిమా సమయానికి నేను ఆరో తరగతిలో ఉన్నా. నాతో హృతిక్ మాట్లాడేసరికి నా ఆనందానికి అవధుల్లేవు. హృతిక్ తో సెల్ఫీని పెద్ద ఆస్తిలాగా దాచుకుంటాను’’ అంటూ ట్విట్టర్లో తన ఉద్వేగాన్ని పంచుకుంది అమల.