Begin typing your search above and press return to search.

రిసార్ట్ లో ఆమె ఇంత‌ప‌ని చేస్తుంద‌నుకోలేదు!

By:  Tupaki Desk   |   4 Nov 2021 12:11 PM IST
రిసార్ట్ లో ఆమె ఇంత‌ప‌ని చేస్తుంద‌నుకోలేదు!
X
కేర‌ళ కుట్టి అమ‌లాపాల్ కంబ్యాక్ లో చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆన్ ద స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ అమ‌లాపాల్ యాక్టివిటీస్ పై యూత్ క‌న్ను ఉంది. ఇటీవ‌ల పాల్ న‌టిగా ఫుల్ బిజీ అయింది. ద‌ర్శ‌కుడు. ఏ. ఎల్ విజ‌య్ తో విడాకుల త‌ర్వాత ఆ ప్ర‌భావం అమలాపాల్ కెరీర్ పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని సందేహాలు వ్య‌క్తం అయిన‌ప్ప‌టికీ అలాంటిది ఎక్క‌డా క‌నిపించ‌లేదు. బ్రేక‌ప్ త‌ర్వాత న‌టిగా మ‌రింత బిజీ అయింద‌ని చెప్పొచ్చు. అప్ప‌టివ‌ర‌కూ ఏడాదికి రెండు..మూడు సినిమాలు చేసిన‌ పాల్ ఇప్పుడు ఏకంగా నాలుగైదు సినిమాలు వ‌రుస పెట్టి చేస్తోంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి షెడ్యూల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇటు తెలుగు-త‌మిళ్ తో పాటు అటు మాతృభాష‌ మ‌ల‌యాళంలోనూ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే వెబ్ సిరీస్ ల్లోన అమ‌లాపాల్ దూసుకుపోతోంది. అటు సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు నిర్మిస్తోంది.

న‌టిగానే కాకుండా నిర్మాత‌గానూ అమ‌లాపాల్ బిజీ అవుతోంది. ఇలా పాల్ ప్రొఫెష‌నల్ కెరీర్ సంతోషంగా సాగిపోతోంది. ఇదే క్ర‌మంలో అమ్మ‌డు టెంప్టింగ్ ఫోటో సెష‌న్ల‌లోనూ అంతే యాక్టివ్ గా పాల్గొంటుంది. ఇటీవ‌ల వ‌రుస‌గా లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కించిన ఈ అమ్మ‌డు తాజాగా రిసార్స్ట్ లో మ‌రోసారి రెచ్చిపోయింది. థై అందాల ఎలివేష‌న్స్ లో మ‌తిచెడ‌గొడుతోంది. రిసార్ట్ లాంజ్ లో ఆరెంజ్ క‌ల‌ర్ సోఫా సెట్ పై వ‌య్యారంగా కెమెరాకు ఫోజులిచ్చి థై అందాల్ని ఎలివేట్ చేసింది. క‌ళ్ల‌కు గాగుల్స్ ధ‌రించి సైడ్ లుక్ లో మైమ‌రిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోపై నెటి జ‌నుల కామెంట్లు అంత‌కంత‌కు హీటెక్కిస్తున్నాయి. రిసార్ట్ లో ఆమె (ఆడై) ఇంత ప‌ని చేస్తుంద‌నుకోలేదు! అంటూ బోయ్స్ కామెంట్ల‌తో రెచ్చిపోతున్నారు. సోష‌ల్ మీడియాలో ల‌వ్ ఫైర్ ఈమోజీల‌తో వేడి పుట్టిస్తోంది యూత్.

సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో కొన్ని బికినీ స‌న్నివేశాల్లో న‌టించింది. అటుపై చాలా రేర్ గానే ఇలాంటి ప్ర‌యివేట్ ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఇంత కాలానికి హాట్ గా ఫోజులివ్వ‌డం విశేషం. ప్ర‌స్తుతం సొంత నిర్మాణ సంస్థ‌లో తెర‌కెక్కుతోన్న `క‌డావ‌ర్` అనే చిత్రంలో న‌టిస్తోంది.