Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : ఆకాశమంత ఎత్తున అందాల అమలా

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:15 AM GMT
క్లిక్‌ క్లిక్‌ : ఆకాశమంత ఎత్తున అందాల అమలా
X
2010లో వచ్చిన 'మైనా' సినిమాతో సౌత్‌ ఇండియా సినీ ప్రేక్షకులందరికి సుపరిచితం అయ్యి అక్కడ నుండి సినీ ప్రస్థానంను మొదలు పెట్టిన అమలా పాల్‌ బోల్డ్‌ పాత్రతోనే మొదటి అవకాశం దక్కించుకుని ఆ తర్వాత తెలుగు.. తమిళం.. హిందీ ఇలా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది. హీరోయిన్‌ గా బిజీగా ఉన్న సమయంలో దర్శకుడు విజయ్‌ ను పెళ్లి చేసుకోవడం విభేదాల కారణంగా విడిపోవడం జరిగింది. పెళ్లి విడాకుల తర్వాత మళ్లీ సినీ కెరీర్‌ ను పునః ప్రారంభించడంతో పాటు ఒంటరిగా జీవితాన్ని ఆస్వాదిస్తూ వస్తోంది. ఈ అందమైన ముద్దుగుమ్మ అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిల్చుని త ఈసుకున్న ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

అద్బుతంగా మేఘాలు మరియు ఆకాశం ఆమె అందాన్ని బీట్‌ చేయాలన్నంత అందంగా కనిపిస్తున్నాయి. ఆ అందమైన పకృతి ఒడిలో అంతే అందమైన క్యూట్‌ అమలా పాల్‌ ఉంది. నవరాత్రుల ప్రత్యేకతను చెప్పేందుకు గాను అమలా ఈ ఫొటోలు షేర్‌ చేయడం ఆశ్చర్యంగా అనిపించింది. ఎత్తైన ప్రదేశం నుండి ఆమె ఆకాశంలోకి అలా చూస్తూ ఉన్న ఈ ఫొటోల్లో లొకేషన్‌ గురించి అంతా కామెంట్‌ చేస్తున్నారు. లొకేషన్‌ చాలా అద్బుతంగా ఉంది.. ఆ లొకేషన్‌ లో మీ స్టిల్స్ మరింతగా బాగున్నాయి అంటూ నెటిజన్స్‌ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె తమిళంలో ఒక సినిమాను మలయాళంలో ఒక సినిమాను తెలుగులో ఒక వెబ్‌ సిరీస్‌ ను చేస్తోంది.