Begin typing your search above and press return to search.

సెక్సీగా అమల గొడవలు రేపిందే

By:  Tupaki Desk   |   5 Aug 2017 6:19 AM GMT
సెక్సీగా అమల గొడవలు రేపిందే
X
ఏ హీరోయిన్ ఎప్పుడు ఎందుకు స్కిన్ షో చేస్తుంది అనేది పూర్తిగా ఆమె ఇష్టం. అది చూసి ఆస్వాదిస్తే ఆస్వాదించాలి లేకపోతే వదిలేయాలి. కాని మన నెటిజన్లు మాత్రం దీపికా పదుకొనె తన కాళ్ళను నడుం క్రింద భాగం నుండి సాంతంగా ఆరబోస్తూ మ్యాగ్జిమ్ వారికి ఫోజిచ్చినా.. ఫాతిమా సనే షేక్ జిక్యూ కోసం బికినీలో కనిపించినా.. వీళ్ళకు కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే కోవలో హీరోయిన్ అమలను కూడా తిట్టిపోస్తున్నారు మన జనాలు. ఎందుకో చూద్దాం పదండి.

'తిరుట్టు పాయెలే 2' అంటూ ఇప్పుడు ఒక సినిమా వస్తోంది. ఈ సినిమాలో అమలా పాల్.. బాబీ సింహా మెయిన్ జంటగా.. వివేక్ మరియు సనమ్ షెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు విక్రమవేధ సక్సెస్ తో ఊపుమీదున్న విజయ్ సేతుపతి నిన్న ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో వానలో తడుస్తున్న అమల అండ్ బాబీ సింహా చాలా రొమాంటిక్ మూడ్ లో కనిపిస్తారు. అలా అతను ఆమె నడుంపై చేయేసి నిమిరుతుంటే.. ఆమె తన నాభి అందాలను ఆరబోస్తూ మత్తెక్కించింది. ఇదే ఇప్పుడు జనాలకు నచ్చట్లేదు.

ఆల్రెడీ ఏఎల్ విజయ్ ను పెళ్ళిచేసుకుని విడాకులు తీసుకుని.. నువ్వు చేసే పనులు ఇవా అంటూ తిట్టపోస్తున్నారు. ఇంత సెక్సీగా కనిపిస్తావా అంటూ గొడవలు చేస్తున్నారు. అసలు పెళ్ళికీ ఇలా కనిపించడానికి లింక్ ఏంటో తెలియదు కాని.. పెళ్ళవ్వని హీరోయిన్ అయితే ఇలా చూపగానే హాట్ అని కితాబు ఇచ్చేస్తూ.. ఇతరుల విషయాల్లో బూతులు తిడుతూ.. నెటిజన్లు తమకు ఇంగితం లేదని మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు.