Begin typing your search above and press return to search.

ఆ క‌ళ్లు క‌ళ్ల‌జోడు చూడ‌త‌ర‌మా?

By:  Tupaki Desk   |   8 Dec 2018 1:30 AM GMT
ఆ క‌ళ్లు క‌ళ్ల‌జోడు చూడ‌త‌ర‌మా?
X
ఏదో ఒక ప్ర‌త్యేక‌త లేనిదే ఎవ‌రైనా ఎందుకు త‌న‌నే చూడాలి? అందుకే ఏదో ఒక సంథింగ్ చూపిస్తూ సామాజిక మాధ్య‌మాల్లో విరుచుకుప‌డుతోంది అమ‌లా పాల్. అప్ప‌ట్లో బెంజ్ కార్ వివాదం త‌న‌ని ఎంత‌గా వేధించినా .. విసిగించే వాళ్లంద‌రికీ కౌంట‌ర్లు వేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో నానా హైరానా ప‌డింది. కానీ ఇప్పుడు అలంటి ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయిన‌ స‌న్నివేశం లేక ప్ర‌శాంతంగా ఉంది. పైగా సినిమాల్లేక ఖాళీగా ఉందేమో.. ప్ర‌స్తుతం సొంతదైన‌ దేవుని దేశం కేర‌ళ‌లో షికార్లు చేస్తూ వేడెక్కిస్తోంది. ఊళ్ల మ‌ధ్య‌లో స‌ర‌స్సులు - చెరువుల్లో బోట్ షికార్ వెళుతూ.. అంద‌మైన లొకేష‌న్ క‌నిపిస్తే చాలు అక్క‌డ ప‌డ‌వ‌ను ఆపేసి, ఆ ర‌మ్య‌మైన దృశ్యంలో ఓ ఫోటో దిగి వాటిని అభిమానుల‌కు షేర్ చేస్తోంది. వాటిని అభిమానులు అంతే ఇదిగా క్యాచ్ చేసి త‌మ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేస్తున్నారు.

లేటెస్టుగా ఈ సిరీస్‌ లోనే ఓ కొత్త ఫోటోని అమ‌లాపాల్ షేర్ చేసింది. ఈ ఫోటో సంథింగ్ స్పెష‌ల్. భుజాల పైనుంచి జార‌విడిచిన లూజ్ ష‌రాయి టైపు వైట్ డ్రెస్‌లో టూ హాట్ గా కనిపిస్తోంది. వైట్ కి కాంబినేష‌న్‌ గా పెట్టుకున్న ఆ ప‌సుపుప‌చ్చ గాగుల్స్ అంతే వేడి పెంచాయి. గాంధీ తాత క‌ళ్ల‌ద్దంలా.. నా పేరు సూర్య క‌ళ్ల‌ద్దంలా రౌండ్ ఫ్రేమ్‌ తో ఉన్నా.. అందులో ఆ ప‌సుపు ప్ర‌త్యేక శోభ‌ను తెచ్చింది. అస‌లే హాట్ గా ఉండే ఆంటీగారి రూపాన్ని మ‌రింత హాట్ గా మార్చేసింది ఈ క‌ళ్ల‌ద్దం.

జీవితాన్ని ఫిల్ట‌ర్ చేస్తే.. ఒక‌వేళ ఆ అవ‌కాశ‌మే ఉంటే... ఇన్ & యాంగ్ ఇద్ద‌రికీ థాంక్స్ చెప్పాలి! ఇదిగో ఇలా గ్లాసెస్‌ ని ధ‌రించండి!! అంటూ త‌న‌దైన శైలిలో ఫిల‌సాఫిక‌ల్ పోయెట్రీనే చెప్పింది. మొత్తానికి మేల్ - ఫీమేల్ ఇద్ద‌రికీ స‌రిప‌డే ఆ గాగుల్స్ క‌నిపెట్టిన వాళ్ల‌నే ఈ అమ్మ‌డు పొగిడేస్తోందంటే అంత‌గా క‌ళ్లజోడు న‌చ్చేసింద‌నే అర్థం. ఇంత‌కీ అమ‌లాపాల్ న‌టించిన ఎమోష‌న్ హార‌ర్ టెర్ర‌ర్ మూవీ `ఆదై` ఎప్పుడు రిలీజ్‌ కి వ‌స్తోందో కానీ - ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ - కోలీవుడ్‌లో ఈ భామ చ‌ప్పుడే వినిపించ‌డం లేదు. ఆదై చిత్రంతో పాటు మ‌రో రెండు సినిమాల్లో న‌టిస్తున్నా ఎప్పుడొస్తాయో అర్థంకాని స‌న్నివేశ‌మేంటో?