Begin typing your search above and press return to search.

ఇక గ్లామర్ అందాలను చూస్తారా?

By:  Tupaki Desk   |   8 Nov 2017 6:00 AM IST
ఇక గ్లామర్ అందాలను చూస్తారా?
X
ఈ మధ్య కాలంలో సౌత్ సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోన్న హీరోయిన్స్ లలో అమలా పాల్ కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. రోజుకొక సంతోషాన్ని వారానికో చేదు అనుభవాన్ని చూస్తోంది. గత రెండు నెలల క్రితం సిగరెట్ తాగుతూ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తన నుంచి విడిపోయిన భర్త చాలా మంచివాడని చెప్పి టాపిక్ ని చర్చనీయాంశంగా మార్చేసింది.

ఇక రీసెంట్ గా పన్ను వివాదమైతే ఓ రేంజ్ లో హల్చల్ చేసింది. ఇలాంటి ఆరోపణలు వస్తుంటే ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉందని బాధపడింది. వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలను ఎదుర్కొన్నా కూడా అమలా పాల్ వృత్తిపరంగా మాత్రం చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. వయసు పెరిగిన కొద్దీ ఇంకా తన అందాన్ని చాలా వరకు పెంచుకుంటోంది. అయితే ఇప్పటివరకు తనలోని నటనను తన స్థాయి వరకు చేసి మెప్పించిన అమలా ఇక నుండి గ్లామర్ పాత్రలను కూడా గట్టిగా చేయాలనీ అనుకుంటోంది.

అందుకే ఫిట్ గా ఉండాలని జిమ్ వర్కౌట్స్ కష్టపడి చేస్తోందట. రానున్న సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ డోస్ బాగా పెంచానుందని తెలుస్తోంది. ఈ మధ్యన హాట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగానే షేర్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటోలో అయితే అమలా చాలా ఘాటుగా కనిపిస్తోంది. అవన్నీ కాకుండా ఆమె రాబోయే సినిమా పోస్టర్ ఒకటి చూస్తే.. మనకు మతిపోవడం ఖాయం. తిరుట్టుపాయలే 2 కొత్త పోస్టర్లో కూడా నాభి సోయగాలతో మతిపోగొట్టేసింది అంతే.