Begin typing your search above and press return to search.
నార్త్ లో అవి కామన్.. సౌత్ లో లేదు!
By: Tupaki Desk | 9 Aug 2019 5:06 AM GMTబాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'పింక్' చిత్రాన్ని తమిళంలో 'నేర్కొండ పార్వై' టైటిల్ తో రీమేక్ చేశారు. అమితాబ్ బచ్చన్ హిందీలో పోషించిన న్యాయవాది పాత్రను తమిళంలో 'తల' అజిత్ పోషించాడు. ఈ సినిమా నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ దక్కుతోంది. సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్ .. మహిళా స్వేచ్చ.. స్త్రీ పురుష సమానత్వం లాంటి సెన్సిటివ్ పాయింట్స్ మీద రన్ అవుతుంది. ఈ సినిమాపై కొందరు తమిళ విమర్శకుల వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
'పింక్' ఎంతమంది చూశారో తెలియదు కానీ ఈ సినిమాలో కీలకమైన పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి/మహిళ కనుక ఒక వ్యక్తికి సెక్స్ విషయంలో 'నో' చెప్తే దానర్థం 'నో' అనే. అమ్మాయి డీసెంట్ అయి ఉండొచ్చు.. ఇండీసెంట్ అయి ఉండవచ్చు.. ఆఖరికి ప్రాస్టిట్యూట్ కూడా అయి ఉండొచ్చు. పొట్టి బట్టలు వేసుకొని తిరగవచ్చు.. అయినా "ఆ అమ్మాయి నో అంటే నో అనే అర్థం". ఇది సంప్రదాయవాదులకు కొరుకుడుపడని అంశం. సరిగా ఈ పాయింట్ పై చర్చిస్తూ కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'నేర్కొండ పార్వై చిత్రం గురించి చర్చలో పాల్గొన్న ముగ్గురు తమిళ క్రిటిక్స్ "అమ్మాయిలు పబ్స్ కు వెళ్ళడం.. అబ్బాయిలతో సెక్స్ లో పాల్గొనడం ఉత్తరాదిలో సాధారణం.. కానీ దక్షిణాదిలో కాదు' అంటూ కామెంట్లు చేశారు.
ఆ విమర్శకుల వ్యాఖ్యలపై.. ఈ వీడియో పై నెటిజన్లు దుమ్మెత్తి పొస్తున్నారు. ఇలా నార్త్ మొత్తాన్ని ఒక గాటన కట్టడం వారి అజ్ఞానాన్ని సూచిస్తోందని మండిపడుతున్నారు. ఈ వీడియోపై ఇప్పటికే అమలా పాల్ లాంటి వారు స్పందిస్తూ ఆ క్రిటిక్స్ జోకర్స్ లాగా ఉన్నారని పిచ్చి లాజిక్కులు చెప్పి లోకం దృష్టిలో ఫూల్స్ అవుతున్నారంటూ ట్వీట్ చేసింది. ఇలాంటివారికి చదువు అవసరమని.. వారు స్కూల్ లో ఉండాలి అంటూ చురక అంటించింది. ఈ సినిమాను తీసిందే ఇలాంటి బూజుపట్టిన ఆలోచనా విధానం కలిగిన వారికోసమేనని.. అది అర్థం కాకపోవడం దురదృష్టకరమని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
For Video Click Here