Begin typing your search above and press return to search.

అమలాపాల్ కి చాన్స్ ఇస్తే...

By:  Tupaki Desk   |   16 Aug 2016 9:17 AM IST
అమలాపాల్ కి చాన్స్ ఇస్తే...
X
సౌత్ ఇండియా హీరోయిన్ అమలాపాల్ - డైరెక్టర్ విజయ్‌ ల ప్రేమ పెళ్లి పెటాకులై - వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోబోతుండటం.. ఈ మేరకు తమకు విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి వ్యవహారంపై ఒక కొత్త న్యూస్ తాజాగా బయిటకు వచ్చింది. వాస్తవాలు ఇంకా పూర్తిగా తెలియనప్పటికీ... ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో ఈ కొత్త విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే.. అమలా పాల్ పై అనఫీషియల్ బ్యాన్!!

అవును.. తాజా సమాచారం ప్రకారం - స్థానిక మీడియా కథనాల ప్రకారం అమలా పాల్ ను కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం అమాలాపాల్ (మాజీ) మామగారు - డైరెక్టర్ విజయ్ తండ్రి అలగప్పన్ అని చెప్పుకుంటున్నారు. అయితే అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఈయన హస్తం పరోక్షంగా ఉందా, ప్రత్యక్ష్యంగా ఉందా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే డైరెక్టర్ విజయ్ తండ్రి అలగప్పన్ ఓ పేరున్న నిర్మాత - నటడు - తమిళ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతోనూ - దర్శకులతోనూ మంచి స్నేహ భాంధవ్యాలు ఉన్నవాడు కావటంతో.. అమలాపాల్ కు అవకాశాలు ఇస్తే ఇతనితో తగువుపెట్టుకున్నట్లే అని కొంతమంది భావిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో అమాలాపాల్ కు అవకాశం ఇస్తే.. పరోక్షంగా ఈయనకు శత్రువులం అవుతామనే ఆలోచనలో కొందరు నిర్మాతలు ఉన్నాట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కమిట్ అయిన ధనుష్ చిత్రం వడ చెన్నైలో మాత్రం అమలా పాల్ కొనసాగనున్నారు. ఈ సినిమా తర్వాత ఇంక ఏ సినిమాలైనా ఉంటాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది!

కాగా అభిప్రాయభేదాల కారణంగా చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్న అమాలాపాల్ - విజయ్ లు తాజాగా పరస్పర అంగీకారం మీద విడాకులకు అప్లై చేసుకున్నారు. ఈ విషయమై అమలా పాల్ మాత్రం మీడియా ముందుకు రావటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదట. ఇదే సమయంలో దర్శకుడు విజయ్ సైతంమీడియాకు అందుబాటులో లేరు. కోర్టు ఈ జంటకు ఇచ్చిన ఆరు నెలల కాలవ్యవధి ముగిసిన తర్వాత వారిద్దరూ సమ్మతిస్తే విడాకులు మంజూరవుతాయి.