Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పాలుగారే అందాల అమల

By:  Tupaki Desk   |   24 Oct 2016 1:30 PM GMT
ఫోటో స్టోరీ: పాలుగారే అందాల అమల
X
కేరళ బ్యూటీ అమలా పాల్ కి కోలీవుడ్ లో బాగా క్రేజ్ ఎక్కువే. అక్కడే అత్తారిల్లు కూడా వెతుక్కుంది కానీ.. రీసెంట్ గానే అది బ్రేకప్ కి దారి తీసింది. లైఫ్ లో వచ్చిన డిస్టర్బెన్స్ ని పక్కన పెట్టేసి అమల ఎంజాయ్ చేసేస్తోంది కాబట్టి.. మనం కూడా ఇక ఆ టాపిక్ ని పక్కన పెట్టేసి.. బర్త్ డే సంగతులనే చెప్పేసుకుందాం. దానికి ముందు అమల దారబోస్తున్న అందాల సంగతులను కూడా కాసింత పట్టించుకుందాం.

ట్యాలెంటెడ్ అనిపించున్నంత మాత్రాన ఎక్స్ పోజింగ్ చేయకూడదని.. అందాలు చూపించకూడదని రూల్ ఏమైనా ఉందా అన్నట్లుగా ఉంటుంది అమలా పాల్ వ్యవహారం. వయ్యారాల రహదారిని ముందు నుంచీ వదలట్లేదు ఈ బ్యూటీ. అయితే ఆ అందాల విందును కేవలం వెండితెరకే పరిమితం చేయకుండా.. అమ్మడు ఇప్పుడు రియల్ లైఫ్‌ లో కూడా కిక్కిస్తోంది. చిట్టిపొట్టి డ్రస్సుల్లో ఊరిస్తోంది. అమ్మడును చూసిన వారెవరైనా కూడా.. వావ్ వాటే గ్లామర్ అనకుండా ఉండలేరు మరి.

ఇక అమల బర్త్ డే సంగతులను ఓసారి చూస్తే.. అక్టోబర్ 26న ఈమె పుట్టినరోజు. రీసెంట్ గా అమెరికా వెళ్లి కొన్ని రోజులు గడిపి ఇండియాకి తిరిగొచ్చిన ఈ బ్యూటీతో కలిసి.. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఐదు రోజుల ముందే పార్టీ సెలబ్రేట్ చేసేశారు. ఆ సెలబ్రేషన్స్ లో కూడా అమ్మడి సెక్సీ లుక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/