Begin typing your search above and press return to search.
కేసు పక్కనెట్టి అమల ప్రాక్టీస్
By: Tupaki Desk | 30 Jan 2018 4:23 AM GMTఅమలా పాల్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఆమె అరెస్టు కావడం కూడా లాంఛనమే అనే మాటలు కొన్ని వినిపిస్తున్నాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో బీమా సర్టిఫికేట్స్ పొంది.. వాటితో ఖరీదైన కారును పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించి.. లక్షల కొద్దీ సొమ్ము మిగుల్చుకుంది. దీనిపై జరుగుతున్న విచారణలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ముందు తన వాదన వినిపించింది అమలాపాల్.
ఒకవైపు ఈ ఇబ్బందులు వెంటాడుతున్నా.. అంతకు ముందే ఇంతకు మించిన కష్టాలను అధిగమించి వచ్చిన వైనం అమల సొంతం. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన అమలాపాల్.. ఈ కేసులను పెద్దగా లక్ష్యపెట్టే వ్యక్తి కాదు. అందుకే తన ప్రొఫెషనల్ పనుల్లో తీరిక లేకుండానే గడిపేస్తోంది. మలేషియాలో ఫిబ్రవరి 3వ తేదీన డాజిలింగ్ తమిళచి అంటూ ఓ భారీ ప్రోగ్రాం జరగబోతోంది. కోలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానుండగా.. ఇందులో అమలా పాల్ డ్యాన్స్ షో కూడా ఉంది.
ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన రిహార్సల్స్ చేస్తోంది అమలా పాల్. ఓ చిన్న పాటి ట్రాక్.. వైట్ టీషర్ట్ వేసుకుని... ఫ్లోర్ పై డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న అమలాపాల్ ఫోటోలు చూడముచ్చటగా ఉన్నాయి. మేకప్ లేకుండా అమలా పాల్ ఎంత సహజమైన అందంగా ఉంటుందో ఈ ఫోటోలు చెబుతున్నాయి.