Begin typing your search above and press return to search.

ధ‌నుష్ కు మంచి భార్య‌న‌వుతాః అమ‌లా పాల్‌

By:  Tupaki Desk   |   28 Jun 2017 9:51 PM IST
ధ‌నుష్ కు మంచి భార్య‌న‌వుతాః అమ‌లా పాల్‌
X
దర్శకుడు విజయ్‌ ను అమ‌లా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం, త‌ద‌నంత‌రం విడాకులు తీసుకోవ‌డం తెలిసిన విష‌య‌మే. అయితే, త‌న‌కు అవ‌కాశ‌మిస్తే మంచి భార్య‌న‌ని నిరూపించుకుంటుంద‌ట. అందుకు, హీరో ధనుష్ అవ‌కాశ‌మిస్తే బాగుంటుంద‌ని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిందీ అమ్మ‌డు. చ‌క్క‌గా కాపురం చేసుకుంటున్న ధ‌నుష్‌ను అమ‌లా పాల్ పెళ్లి చేసుకోవ‌డం ఏమిటి? అనుకుంటున్నారా?

ఏమీ లేదండీ - త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న వీఐపీ-2లో ధ‌నుష్ భార్య‌గా అమ‌లాపాల్ న‌టిస్తోంది. గతంలో వచ్చిన వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ- తెలుగులో రఘువరన్‌.బీటెక్‌) సినిమాలో వీళ్లిద్దరి కెమెస్ట్రీ అద్భుతంగా పండటంతో రెండో భాగానికి కూడా అమలానే ఎంపికచేసుకున్నారు. ఒక‌వేళ వీఐపీ-3 నిర్మిస్తే అందులో ధనుష్‌ కు మంచి భార్యగా ఉంటా అని చమత్కరించింది అమలాపాల్‌. ఈ ర‌కంగా ఇంకా వస్తుందోరాదో తెలియని సినిమాలో తన పాత్రను కన్ఫార్మ్‌చేసుకుందీ ముద్దుగుమ్మ‌!

వీఐపీ-1లో హీరో ధనుష్‌ ని ఆటపట్టించి, ఏడిపించే ప్రియురాలిగా అమ‌లాపాల్ న‌టించింది. వీఐపీ-2లో హీరో భార్యగా చేస్తోంది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడిన‌పుడు పై వ్యాఖ్య‌లు చేసింది. ''వీఐపీ-1లో నా పాత్రను చంపేయనందుకు థ్యాంక్స్‌. వీఐపీ-2లో సతాయించే భార్యగా నటిస్తున్నా. ఫస్ట్‌ పార్ట్‌ లో ప్రియురాలిగా, సెకండ్‌ పార్ట్‌ లో హింసించే అర్ధాంగిగా చేశాను. అవ‌కాశం వ‌స్తే వీఐపీ-3లో క‌చ్చితంగా ధ‌నుష్‌ కు మంచి భార్య‌గా న‌టిస్తా'' అంటూ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టింది అమలా పాల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/