Begin typing your search above and press return to search.

'ప్లీజ్' అంటున్న బెజవాడ బ్యూటీ!

By:  Tupaki Desk   |   22 April 2020 4:30 PM GMT
ప్లీజ్ అంటున్న బెజవాడ బ్యూటీ!
X
టాలీవుడ్ లో 'బెజవాడ' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నటి అమలాపాల్. చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో, అందాల ఆరబోతతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. రామ్ చ‌ర‌ణ్ తో 'నాయక్', అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు మాత్రం రాలేదు. దీంతో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌పై దృష్టి పెట్టింది ఈ భామ‌. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు. అమలాపాల్ జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు వెంటవెంటనే జరిగిపోయాయి.

దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌తో విడిపోయిన తర్వాత ఓ వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. కానీ ఆయన ఎవరో మాత్రం వెల్లడించలేదు. ఇదే సమయంలో ముంబయికి చెందిన గాయకుడు భవ్‌నీందర్‌ సింగ్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆమె, భవ్‌నీందర్‌ సింగ్‌ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆయన అమలాపాల్‌ నుదుట కుంకుమ పెడుతూ కనిపించారు. అయితే ఆ ఫొటోలపై ఆమె అప్పట్లో స్పందించలేదు. తాజాగా రెండో పెళ్లి పై అమలాపాల్‌ను ప్రశ్నించగా.. ‘నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నా. సినిమా షూటింగ్స్‌ పూర్తయితే.. నా పెళ్లి గురించి ప్రకటిస్తా. ఇప్పటికే నా ప్రియుడి గురించి చెప్పేశా.. కాబట్టి వివాహం గురించి కూడా చెబుతా. అప్పటి వరకు నా పెళ్లిపై ఎటువంటి రూమర్స్ రాయొద్దు. సమయం వచ్చినప్పుడు నేను దాని గురించి చెబుతా’ అని సెలవిచ్చింది.