Begin typing your search above and press return to search.
మాస్కులతో బర్త్ డే హంగామా చేసిన హీరోయిన్..
By: Tupaki Desk | 7 May 2020 7:00 PM ISTబెజవాడ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో, అందాల ప్రదర్శనతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. రామ్ చరణ్ తో 'నాయక్', అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది ఈ భామ. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని అందర్ని ఆశ్చర్య పరిచింది. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు. ఆ తర్వాత తమిళ డబ్బింగ్ సినిమా రఘువరన్ బిటెక్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన అమ్మడు తెలుగులో మాత్రం కనపడలేదు.
ఇటీవలే 'ఆమె' తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి పోయింది. సినిమాలలో సరిగ్గా కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటానంటుంది అమలాపాల్. ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన అమ్మడు ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు బాలీవుడ్ వెబ్ సిరీస్ లోకి వెళ్లబోతుంది. తాజాగా లాక్‌డౌన్‌లోనే తన బ్రదర్ బర్త్ డే వేడుకలను ఫుల్ గ్రాండ్ గా జరిపిందట. ఆ బర్త్ డే హుంగామ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో అమలాపాల్ ముఖానికి మాస్క్ ధరించి టీవీనే డీజేగా మార్చి డ్యాన్స్‌లు చేశారు. అమలాపాల్ మాట్లాడుతూ.. నా ప్రియమైన, అందమైన, ఫన్నీయస్ట్, వన్ అండ్ ఓన్లీ మా సోదరుడు అభిజిత్ పాల్ బర్త్ డే. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్క్ ధరించి పార్టీ చేసుకొన్నామని తెలిపింది.