Begin typing your search above and press return to search.
అమలాపాల్ సైకో కిల్లరా? పోలీసాఫీసరా?
By: Tupaki Desk | 27 Oct 2021 11:11 AM ISTతమిళం తెలుగులో అగ్ర హీరోల సరసన నటించింది అమలాపాల్. చరణ్ .. బన్ని లాంటి టాప్ హీరోలతో తెలుగులో ఆడిపాడింది. ఇటీవల ఆమె (ఆడై) అనే ప్రయోగాత్మక చిత్రంలో నగ్నంగా నటించి షాకిచ్చింది. ప్రయోగాలకు ఏమాత్రం వెరవని అమలా పాల్ ఇప్పుడు సైకో కిల్లర్ గా మారిపోయింది. అమ్మాయిల ఆర్గాన్స్ కోసం వరుస హత్యలు చేసే మాఫియా పని పట్టే పోలీసాఫీసర్ గా అమలాపాల్ నటిస్తోంది. సైకో కిల్లర్ గా వికృత పాత్రతో పాల్ సర్ ప్రైజ్ చేయబోతోందా? అనేది ఇందులో సస్పెన్స్ గా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ రకరకాల సందిగ్ధతలకు తెర తీసింది.
తనే నిర్మాతగా మారి ఆర్గాన్ కిల్లర్ స్టోరీ నేపథ్యంలో ఓ మూవీని అమలాపాల్ చేస్తోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `కడవెర్` అని టైటిల్ ని నిర్ణయించారు. కడవెర్ అంటే `శవం` అని అర్థం. శవాల చుట్టూ జరిగే ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమలా పాల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమలా పాల్ ఈ మూవీని నటిస్తూ నిర్మిస్తోంది.
అనూప్ ఎస్ ఫనికర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మోషన్ పోస్టర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఆర్గాన్స్ తొలగించి కెమికల్ నింపిన జార్స్ పక్కన కూర్చుని తాపీగా టిఫిన్ చేస్తూ డేంజరస్ లుక్ తో కనిపిస్తున్న అమలాపాల్ స్టిల్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో పాల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తోందని సమాచారం. సైకో పాథ్ ఆర్గాన్ మాఫియా థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ థ్రిల్లర్ చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని అమలా పాల్ తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్లానింగ్ లో ఉన్నారని తెలిసింది.