Begin typing your search above and press return to search.

మరో థ్రిల్లర్ తో అమల ప్రయోగం

By:  Tupaki Desk   |   11 Aug 2019 2:02 PM IST
మరో థ్రిల్లర్ తో అమల ప్రయోగం
X
ఇటీవలే ఆమె సినిమాలో న్యూడ్ సీన్స్ తో సెన్సేషన్ రేపిన హీరొయిన్ అమలా పాల్ దానికి తగ్గ ఫలితం అందుకోలేదు కాని తన సాహసానికి మాత్రం మెప్పులు పొందింది. అదే రోజు ఐస్మార్ట్ శంకర్ రిలీజ్ కావడంతో ఆమె జానానికి చేరలేకపోయింది. ఇటీవలి కాలంలో థ్రిల్లర్స్ తో ఎక్కువ ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్న అమలా పాల్ తాజాగా మరో బై లింగ్వల్ మూవీ మొదలుపెట్టింది. వెరైటీగా రెండు బాషల్లోనూ రెండు ఓపెనింగ్స్ చేసి మీడియా దృష్టిని ఆకట్టుకుంది.

ఇందులో తను ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్ గా విభిన్న పాత్రను పోషిస్తోంది. థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీకి అనూప్ దర్శకుడు. 24 కిసెస్ - చీకటి గదిలో చితకొట్టుడు ఫేం అదిత్ అరుణ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కేవలం మూడంటే మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి రెండు బాషలలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట

నిర్మాతగానూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న అమలా పాల్ సబ్జెక్టు మీద మూడు నెలలు వర్క్ చేసిందట. చెన్నైలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలు ఆధారం చేసుకుని రూపొందించిన ఈ సినిమా ద్వారా గట్టి హిట్టు కొట్టాలనే టార్గెట్ తో ఉంది అమలా పాల్. గతంలో రామ్ చరణ్ నాయక్ తో ఆడిపాడిన ఈ భామ ఆ తర్వాత ఎక్కువ తెరమీద కనిపించలేదు. మళ్ళి ఇన్నాళ్ళకు హీరొయిన్ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా వేగం పెంచడం చూస్తే అమలా జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు