Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ : ఆమె అసలు తగ్గడం లేదు

By:  Tupaki Desk   |   21 Jun 2019 4:08 PM IST
ఫస్ట్ లుక్ : ఆమె అసలు తగ్గడం లేదు
X
టీజర్ లో దాదాపు నగ్నంగా నటించి సంచలనం రేపిన అమలా పాల్ ఆ ఒక్క వీడియోతోనే ఆడై సినిమాకు ఫుల్ మార్కెట్ తెచ్చేసింది. దీన్నే తెలుగులో అనువదించి తమ్మారెడ్డి భరద్వాజ్ ఆమె పేరుతో విడుదల చేయనున్నారు. రెండు బాషలలో టీజర్ గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ సీన్ కు సెన్సార్ అనుమతి ఇవ్వడం లేదని ఇప్పటికే చెన్నై మీడియా టాక్ జోరుగా సాగుతోంది. ఈ నేపద్యంలో ఆమె అఫీషియల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు నిర్మాతలు.

ఏదో ఘర్షణకు లోనై శారీరక హింసను అనుభవించి ప్రతిఘటిస్తున్న స్టిల్ లో అమలా పాల్ చాలా సహజంగా కనిపిస్తోంది. ఇది టీజర్ లో చూపించిన విజువల్స్ కు లింక్ అవుతోంది. ఓ తప్పిపోయిన అమ్మాయి ఎవరు లేని బహుళ అంతస్తుల బిల్డింగ్ లో దుస్తులు లేని స్థితిలో కనిపించడం ఆ తర్వాత పోలీసులు విచారణ మొదలుపెట్టడం టీజర్ లో చూసాం. ఇది ఆ దురాగతానికి సంబంధించిన స్టిల్ గా కనిపిస్తోంది

మొత్తానికి ఆమె మెల్లగా అంచనాలు పెంచేస్తోంది. రామ్ చరణ్ తో నాయక్ లో నటించిన హీరొయిన్ గా పరిచయమైన అమలా పాల్ ఆ తర్వాత ఎక్కువ కనిపించలేదు. వివాహం విడాకులు తర్వాత మళ్ళి ఇంత గ్యాప్ తో ఏకంగా సెన్సేషనల్ కంటెంట్ తో వస్తోంది. చిత్ర నిర్మాణానికి గత కొంత కాలంగా దూరంగా ఉన్న సీనియర్ నిర్మాత కం దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు దీని హక్కులు కొనడం విశేషం. వచ్చే నెల విడుదలకు ప్లాన్ చేసిన ఆమె రిలీజ్ కు ముందే ఇంత హాట్ టాపిక్ గా మారితే ఇక విడుదల సమయానికి ఇంకెంత రచ్చ చేస్తుందో