Begin typing your search above and press return to search.
కుక్కలకు మద్దతుగా లాజిక్ పాయింట్ చెప్పిన అమల అక్కినేని
By: Tupaki Desk | 1 March 2023 11:55 AM GMTబ్లూ క్రాస్ సొసైటీ లో కీలక మెంబర్ అయిన అమల అక్కినేని పై గతంలో ప్రశంసలు కురిపించిన వారు ఇప్పుడు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వీధి కుక్కల వల్ల చిన్న పిల్లలు చనిపోతూ ఉంటే వాటికి హక్కులు ఉంటాయి అంటూ అమల అక్కినేని వంటి వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది.
కుక్కల హక్కులను కాపాడాలి అనుకునే వారితో సమాజానికి మంచిది కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు కూడా కుక్కల విషయంలో తీవ్రంగా కామెంట్స్ చేస్తూ బ్లూ క్రాస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా అమల అక్కినేని మరియు రష్మి గౌతమ్ లపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
వీధి కుక్కల వల్ల బాలుడు చనిపోయిన తర్వాత జీహెచ్‌ఎంసీ అధికారులు బ్లూ క్రాస్ మెంబర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ శాతం మంది వీధి కుక్కలను చంపేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యం లో జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్నారు.
ఈ సమయంలో అమల అక్కినేని సమావేశంలో మాట్లాడుతూ... ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేసిన సమయంలో మొత్తం మానవ జాతిని అధ్వానంగా ఉందని అనుకోలేం కదా.. ఇతరులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు అని మనం అనుకోం కదా.. మరి కుక్క ఎవరినైనా చంపినప్పుడు అన్ని కుక్కలను ఒకే విధంగా ప్రవర్తిస్తాయని ఎందుకు అనుకోవాలని అమల అక్కినేని ప్రశ్నించారు.
కుక్కలకు మద్దతుగా అమల అక్కినేని లాజిక్ పాయింట్ లెవనెత్తడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. కుక్కలను చంపడం కంటే కూడా వాటిని స్టెరిలైజ్ చేయడం ద్వారా మరియు టీకాలు వేయడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుందని అమల పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కూడా అమల అక్కినేని పై చాలా మంది తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో మాత్రం కుక్కలన్నింటిని తీసుకు వెళ్లి చంపకుంటే... వాటిని అమల అక్కినేని మరియు రష్మి గౌతమ్ ఇతర బ్లూ క్రాస్ సభ్యుల ఇంట్లో వదిలి పెట్టాలి. వాటి సంరక్షణ మొత్తంను వారే చూసుకోవాలంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.