Begin typing your search above and press return to search.

లాయర్ అక్కినేని అమల

By:  Tupaki Desk   |   20 Aug 2016 1:30 PM GMT
లాయర్ అక్కినేని అమల
X
హీరోయిన్‌ గా మంచి స్థాయిలో ఉండగా.. కెరీర్‌ ను త్యాగం చేసి అక్కినేని నాగార్జునను పెళ్లి చేసుకుని లైఫ్‌ లో సెటిలైపోయింది అమల. ఒకసారి నటనకు స్వస్తి చెప్పాక దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె సినిమాల జోలికే వెళ్లలేదు. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత అమలను ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో నటింపజేశాడు శేఖర్ కమ్ముల. ఐతే ఆ సినిమాలో అమలను అలాంటి ప్యాథటిక్ క్యారెక్టర్లో చూసి ఆమె అభిమానులు తట్టుకోలేకపోయారు. స్వయంగా నాగార్జున ఈ పాత్ర విషయంలో బాధపడ్డాడు. ఈ సినిమా బాగా ఆడి ఉంటే అమల మరిన్ని పాత్రలు చేసేదేమో. కానీ అలా జరక్కపోవడంతో మళ్లీ సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

ఈ మధ్యే హిందీలో ‘హమారీ అధూరికి కహానీ’లో తళుక్కుమన్న అమల.. కమల్ హాసన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమా మొదలవకుండానే ఆగిపోయింది. ఐతే అమల ఇప్పుడు ఓ మలయాళ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు ‘కేరాఫ్ సైరా భాను’. ఇందులో ఆమె లాయర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. అమల హీరోయిన్‌ గా ఉన్న టైంలోనే మలయాళ సినిమాను ఏలిన మంజు వారియర్ ఇందులో లీడ్ రోల్ చేస్తోంది. కొత్త డైరెక్టర్ ఆంటోనీ సోనీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఒకప్పుడు షార్ట్ కెరీర్లోనే తెలుగు - హిందీ - తమిళం - మలయాళ భాషల్లో టాప్ స్టార్లతో నటించింది అమల. మలయాళంలో చివరగా మోహన్ లాల్ సరసన ‘ఉల్లాదక్కం’ అనే సినిమాలో ఆమె కనిపించింది. ఆ సినిమా విడుదలై పాతికేళ్లవుతున్న టైంలో మళ్లీ ఆమె మల్లూవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.