Begin typing your search above and press return to search.

28 ఏళ్ల తర్వాత ఆ కాంబినేషన్

By:  Tupaki Desk   |   4 Nov 2015 9:30 AM GMT
28 ఏళ్ల తర్వాత ఆ కాంబినేషన్
X
హిట్ పెయిర్‌ గా పేరు తెచ్చుకున్న ఒక హీరో - హీరోయిన్ 28 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జత కడితే ఎలా ఉంటుంది? కమల్ హాసన్, అమల జోడీ ఇదే చేయబోతోంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఎంత పెద్ద సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలో ఇద్దరూ కలిసి ఇంకో రెండు సినిమాలు కూడా చేశారు. మళ్లీ కూడా ఈ జంట సినిమాలు చేసేదేమో కానీ.. హీరోయిన్ గా పీక్స్ లో ఉండగానే నాగార్జునను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అమల. ఐతే ఈ మధ్యే మళ్లీ ఆమెకు సినిమాల మీద ఆసక్తి పుట్టింది.

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడమే కాక.. తమిళంలో ఓ సీరియల్ చేస్తోంది. ఇప్పుడు కమల్ హాసన్ తో కలిసి నటించడానికి సిద్ధమైంది. ప్రముఖ మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వంలో కమల్ - అమల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో వయసుకు తగ్గ పాత్రల్లో నటించబోతున్నారు వీళ్లిద్దరూ. అమలతో పాటు మరో సీనియర్ నటి జరీనా వాహబ్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదో ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ అని అంటున్నారు. మొత్తం షూటింగంతా అమెరికాలోనే చేస్తారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తారు. ‘చీకటి రాజ్యం’ తర్వాత కమల్ చేయబోయే సినిమా ఇదే. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేస్తారట.