Begin typing your search above and press return to search.

అక్కడ కూడా అమల రీఎంట్రీ

By:  Tupaki Desk   |   10 Nov 2016 5:30 AM GMT
అక్కడ కూడా అమల రీఎంట్రీ
X
అక్కినేని అమల వరుసగా రీ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారు. దాదాపు పాతికేళ్లుగా కెమేరాకు దూరంగా ఉన్న అమల.. శేఖర్ కమ్ముల మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అమ్మ కేరక్టర్ చేసి.. తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే.. గతేడాది బాలీవుడ్ లో కూడా రీఎంట్రీ ఇచ్చారు అమల. హమారీ అధూరి కహానీ సినిమాలో ఓ చిన్న రోల్ చేసింది. సినిమా ఫ్లాపైనా కూడా.. అమ్మను ఒక్కసారి వెండితెర మీద చూస్తే థ్రిల్ కు గురయ్యానంటూ అప్పట్లో అఖిల్ ట్వీటేశాడు కూడా. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో కూడా తిరిగి నటించబోతుండడం విశేషం. పాతికేళ్ల క్రితం మోహన్ లాల్ మూవీ ఉల్లాడక్కంలో నటించిన అమె.. ఇప్పుడు తిరిగి మల్లూవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అంటోనీ సోని డైరెక్షన్ లో మూవీకి యాక్సెప్ట్ చేయగా.. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. కేరాఫ్ సైరాభాను అనే టైటిల్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో మంజూ వారియర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఆమె పోస్ట్ ఉమన్ గాను.. అమల లాయర్ గాను నటించనున్నారు. ఈ ఇద్దరి చుట్టూనే సినిమా అంతా తిరగనుందని తెలుస్తోంది.

ఇప్పటివరకూ మలయాళంలో అమల రెండు సినిమాలు మాత్రమే చేయగా.. 1991లో విడుదలైన ఆ రెండు చిత్రాలలో సురేష్ గోపి.. మోహన్ లాల్ లతో కలిసి నటించారు. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీతో తిరిగి మలయాళంలో తన మూడో సినిమా చేస్తున్నారు అమల. అలాగే.. ఆమె రీ ఎంట్రీ ఇస్తున్న మూడో ఫిలిం ఇండస్ట్రీ ఇది. తెలుగు.. హిందీ తర్వాత మల్లూవుడ్ లో తన రీఎంట్రీ ఖాయం చేశారు అమల.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/