Begin typing your search above and press return to search.

రోబో-2 తర్వాత శంకర్ అదేనా?

By:  Tupaki Desk   |   6 Nov 2015 1:30 PM GMT
రోబో-2 తర్వాత శంకర్ అదేనా?
X
ఒకటా రెండా.. శంకర్ సినిమాల్లో చాలానే ఉన్నాయి ఆణిముత్యాలు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘భారతీయుడు’. తొంభైల చివర్లో వచ్చిన ఈ సినిమా తెలుగు - తమిళ - హిందీ భాషల్లో సెన్సేషనల్ హిట్టయి.. శంకర్ కు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని చాన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ అది సాధ్యం కాలేదు. ఐతే శంకర్ ప్రస్తుతం తీస్తున్న ‘రోబో-2’ తర్వాత భారతీయుడు-2 సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం.

ఇంతకుముందు వరుసగా భారీ సినిమాలు నిర్మించిన రత్నం.. మధ్యలో కొంచెం స్పీడు తగ్గించాడు. ఈ మధ్య మళ్లీ జోరందుకున్నాడు. ప్రస్తుతం ఆయన అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ దీపావళికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీని తర్వాత భారతీయుడు-2 తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రత్నం చెప్పాడు. ‘‘హేరామ్ తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్ తీయాలని కమల్ అనుకున్నాడు. నాతో చర్చలు కూడా జరిపాడు. ఐతే అప్పుడు సాధ్యపడలేదు. ప్రస్తుతం శంకర్ రోబో-2 తీస్తున్నాడు. దీని తర్వాత శంకర్ - కమల్ కాంబినేషన్ లో భారతీయుడు-2 తీద్దామన్నది నా ఆలోచన. దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. చూద్దాం ఏమవుతుందో’’ అన్నాడు రత్నం.