Begin typing your search above and press return to search.

పీకే 27 ఏళ్ల జ‌ర్నీపై ఏ.ఎం ర‌త్నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   10 March 2023 12:32 PM GMT
పీకే 27 ఏళ్ల జ‌ర్నీపై ఏ.ఎం ర‌త్నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
X
జ‌న‌సేన అధినేత‌...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా..ప్ర‌జా సేవ‌కుడిగా కోట్లాది మంది హృద‌యాల్లో స్థానం సంపాదించారు. ఓవైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉంటూనే ప్రేక్ష‌కాభిమానుల కోరిక మేక‌రు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోద‌రిడిగా ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అయినా కాల‌క్రమేణా మెగా ఇమేజ్ కి దూర‌మై..త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు.

న‌టుడిగా కంటే వ్య‌క్తిగ‌తంగా మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. దాదాపు మూడు ద‌శాబ్ధాల సినీ కెరీర్ లో న‌టుడిగా ఆయ‌న చేసిన సినిమాలు త‌క్కువే. కానీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో శిఖ‌రాగ్రానికి చేరుకున్నారంటే? కేవ‌లం అత‌నిలో మాన‌వ‌తా దృక్ఫ‌ధ‌మే కారాణ‌మ‌నొచ్చు. తాజాగా నేటితో ఆయ‌న సినీ ప్ర‌యాణానికి 27 వ‌సంతాలు పూర్త‌యింది. మార్చి 14న జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం భారీ ఎత్తున మ‌చిలీ ప‌ట్నంలో జ‌ర‌గుతుంది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమాన నిర్మాత ఏ. ఎం ర‌త్నం మెగా ప‌వ‌ర్ స్టార్ ని ఉద్దేశించి ఓ ఆస‌క్తిక‌ర వీడియో రిలీజ్ చేసారు. 'మ‌న‌సేమో ప్ర‌జ‌ల మీద‌. త‌నువేమో వెండి తెర మీద‌. రెండింటిలోనూ ప్ర‌జ‌ల మ‌న‌సు చూరగొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు 27 సంవ‌త్స‌రాల సినీ జీవితాన్ని..తొమ్మిది సంవ‌త్స‌రాల రాజకీయ రంగ జీవితాన్ని పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా వారికి నా శుభాకాంక్ష‌లు. ఆయ‌న ఇంకా ఉన్నత శిఖరాల‌కు ఎద‌గాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను' అని తెలిపారు.

ప్ర‌స్తుతం ఈవీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప‌వ‌న్ అభిమానులు లైక్..షేర్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఏ.ఎం ర‌త్నం నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు.

గ‌తంలో ప‌వ‌న్ తో ఇదే నిర్మాత 'ఖుషీ'..'బంగారం' చిత్రాలు నిర్మించిన సంగ‌తి విధిత‌మే. అప్ప‌టి నుంచి ప‌వ‌న్ తో ర‌త్నంకి మంచి సాన్నిహిత్యం కొన‌సాగుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆయ‌న్ని అంతే అభిమానిస్తారు. ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి చేతులు క‌ల‌ప‌డానికి కార‌ణం కూడా ఆ రిలేష‌నే. నాతో సినిమా చేయండి అని అడిగేంత చ‌నువు ప‌వ‌న్ తీసుకుంటారు. ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో ప‌వ‌న్ స్వ‌యంగా రివీల్ చేసారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.