Begin typing your search above and press return to search.

కాస్మో పాలిట‌న్ లుక్.. సీతాదేవి అలియాస్ కృతి

By:  Tupaki Desk   |   1 April 2021 9:32 AM GMT
కాస్మో పాలిట‌న్ లుక్.. సీతాదేవి అలియాస్ కృతి
X
`1-నేనొక్క‌డినే` చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన కృతి న‌ట‌న‌కు మ‌హేష్ అభిమానులతో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుడు మెస్మ‌రైజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో టాలీవుడ్ నుంచి నిష్కృమించిన ఈ భామ పూర్తిగా బాలీవుడ్ కే అంకిత‌మైంది.

ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటోంది. వ‌రుణ్ ధావ‌న్ లాంటి యువ‌హీరో స‌ర‌స‌న ఈ భామ న‌టిస్తోంది. ఈలోగానే డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ 3డిలో జాక్ పాట్ కొట్టేసింది. ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర‌లో న‌టిస్తోంది కృతి. ఇప్ప‌టికే ఆన్ లొకేష‌న్ లో ప్ర‌భాస్ పంపిన భోజ‌నం క్యారేజీ రుచి చూసి కాంప్లిమెంట్స్ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్న ఈ బ్యూటీ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. అలాగే మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ ఫోటోషూట్ల‌తోనూ బిజీ. తాజాగా కాస్మోపోలిట‌న్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై కృతి ద‌ర్శ‌న‌మిచ్చింది. వైట్ టాప్.. వైట్ మిడ్డీ ధ‌రించి స్టైలిష్ గా ఒక‌ కోట్ ని హ్యాండ్ కి త‌గిలించుకుని క‌నిపిస్తోంది. సీతాదేవిగా ఎంతో ట్రెడిష‌న‌ల్ పాత్ర‌లో న‌టిస్తున్న కృతి మోడ్ర‌న్ అవ‌తార్ సంథింగ్ స్పెష‌ల్ అంటూ ఈ ఫోటోకి అభిమానులు కామెంట్ల‌ను జోడిస్తున్నారు.