Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' ట్యూన్ కూడా కాపీ అంటున్నారేంటి థమన్..!

By:  Tupaki Desk   |   3 March 2021 3:42 PM GMT
వకీల్ సాబ్ ట్యూన్ కూడా కాపీ అంటున్నారేంటి థమన్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాకి ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కేవలం తన మ్యూజిక్ తోనే సినిమాని హిట్ చేస్తున్న థమన్.. పవన్ రీ ఎంట్రీ మూవీకి అదే లెవల్ లో సాంగ్స్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. థమన్ కూడా ఫస్ట్ టైం పవర్ స్టార్ సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం రావడంతో రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'మగువా మగువా' సాంగ్ సూపర్ హిట్ అయి మిలియన్స్ వ్యూస్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా 'వకీల్ సాబ్' నుంచి 'సత్యమేవ జయతే' అంటూ సాగే రెండో పాటని రిలీజ్ చేశారు. పవన్ పాత్ర తీరుతెన్నులని తెలియజేస్తున్న ఈ సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 1 మిలియన్ కి పైగా వ్యూస్ దక్కించుకుంది. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.. శంకర్ మహదేవన్ గాత్రాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఈ ట్యూన్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.

దక్షిణాది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరైన థమన్.. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా కంపోజ్ చేస్తాడనే పేరుంది. అయితే ఎన్ని బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తున్నా థమన్ మీద కాపీ క్యాట్ అనే ముద్ర మాత్రం పోవడం లేదు. ఆయన కంపోజ్ చేసే ప్రతి సాంగ్ కి ఒరిజినల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మాములైపోయింది. ఇప్పుడు తాజాగా 'సత్యమేవ జయతే' సాంగ్ కూడా కాపీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. దీనికి ఒరిజినల్ ట్యూన్ ఇదేనంటూ 'అల్లరి' నరేష్ - సాక్షి చౌదరీ జంటగా నటించిన 'జేమ్స్ బాండ్ - నేను కాదు నా పెళ్ళాం' అనే సినిమాలోని 'బులెట్' అనే సాంగ్ ని బయటకు తీశారు. డాన్ పాత్రధారి అయిన హీరోయిన్ ని ఎలివేట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ స్వరపరిన ఈ సాంగ్ నే, ఇప్పుడు థమన్ కాపీ కొట్టాడని అంటున్నారు. 'The Man' అనే ట్యాగ్స్ వాడుతూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అంత మంచి ట్యూన్ హీరోయిన్ కి వాడి వేస్ట్ చేసారని.. అందుకే ఇప్పుడు థమన్ దాన్ని స్టార్ హీరో సినిమాకి వాడి హిట్ చేసాడని కామెంట్స్ పెడుతున్నారు. దీని కారణంగా ఇప్పుడు 'బుల్లెట్' సాంగ్ కి వ్యూస్ పెరుగుతున్నాయని తెలుస్తోంది. నిజానికి ఇలాంటి ట్రోల్స్ పై థమన్ గతంలో చాలా సార్లు స్పందించారు. మరి లేటెస్టుగా సోషల్ మీడియాలో వస్తున్న ఈ కాపీ ట్రోల్స్ పై రియాక్ట్ అవుతాడేమో చూడాలి.