Begin typing your search above and press return to search.
అల్లూరి Vs భీమ్! దోస్తీ ఎపిసోడ్ తో EMK షోని పైకి లేపేస్తారా?
By: Tupaki Desk | 13 Aug 2021 5:30 AMఅల్లూరి Vs భీమ్! ఇటీవలే రామ్ చరణ్ - తారక రామారావులను దోస్తీ పేరుతో ఒకే ఫ్రేమ్ లో చూపించారు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ సాంగ్ వీడియో చూశాక అభిమానులకు తిక్క రేగింది. దోస్తీ సాంగ్ అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో వైరల్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసింది. మరోసారి అంతకుమించి ప్లాన్ చేస్తున్నారు.
మరోసారి దోస్తులిద్దరినీ కలిపేందుకు ఆగస్టు 15 స్పెషల్ కార్యక్రమాలు రెడీ అవుతుండడం ఎగ్జయిట్ చేస్తోంది. ఈసారి బుల్లితెర షో ఎవరు మీలో కోటీశ్వరుడు? ( EMK ) కోసం ఆ ఇద్దరూ కలుస్తున్నారు. ఒక ఎపిసోడ్ మొత్తాన్ని రంజుగా తయారు చేస్తున్నారన్నది ఇన్ సైడ్ గుసగుస. ఇక EMK షో స్వాతంత్య్ర దినోత్సవ ఎపిసోడ్ టీఆర్పీల్లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ ప్రచారం సాగిపోతోంది. ఆగస్టు 15న దోస్తులిద్దరూ జెమినీ టీవీ రియాలిటీ షోకి పెద్ద ఆధారంగా మారారన్న టాక్ వినిపిస్తోంది. ఇక హోస్ట్ ఎన్టీఆర్ ముందు హాట్ సీట్ లో దోస్త్ రామ్ చరణ్ కనిపిస్తే మెగా-నందమూరి అభిమానుల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించేదే. కచ్ఛితంగా ఈ ఎపిసోడ్ ఉర్రూతలూగిస్తుంది! అంటూ గెస్సింగ్స్ అన్ లిమిటెడ్ గా సాగిపోతున్నాయి.
ఎన్టీఆర్ `ఎవరు మీలో కోటీశ్వరుడు` ప్రోగ్రామ్ తో జెమినీ చానెల్ కి ఊపిరులూదే ప్రయత్నం చేస్తుండడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఇంతకుముందు `స్టార్ మా`లో ఇదే కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు (ఎంఇకే) పేరుతో లైవ్ అయ్యేది. తొలి మూడు సీజన్లను కింగ్ నాగార్జున హోస్ట్ గా నడిపిస్తే .. నాలుగో సీజన్ కి మెగాస్టార్ చిరంజీవి హోస్టింగ్ చేశారు. ఐదో సీజన్ కి యంగ్ టైగర్ హోస్ట్ గా కొనసాగారు. ఆ తర్వాత స్టార్ మా ఈ కార్యక్రమానికి బ్రేక్ వేయగా దానిని జెమినీ డిఫరెంట్ టైటిల్ తో టేకోవర్ చేసింది. ఇది వివాదంగానూ మారింది.
ఇఎంకే ప్రిపరేషన్ ఎంతవరకూ వచ్చింది? అంటే.. ఇప్పటికే స్పెషల్ ఎపిసోడ్ 10 రోజుల షూటింగ్ పూర్తయింది. రామ్ చరణ్ అతిథిగా వెరీ స్పెషల్ ఎపిసోడ్ ని పూర్తి చేసారు. ఆగష్టు 15 న ఆ ఎపిసోడ్ ని జెమినీ ప్రసారం చేయనుంది. ఈ ఎపిసోడ్ పరిశ్రమలోని ఇద్దరు అగ్ర తారల మధ్య స్నేహాన్ని మరోసారి హైలైట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఈ కార్యక్రమం వెనక ప్రధాన ఉద్ధేశం.. ఓవైపు ఇఎంకేకి టీఆర్పీ తేవడం .. రెండో వైపు ఆర్.ఆర్.ఆర్ కి కావాల్సినంత ప్రమోషన్ కొట్టేయడం అన్న టాక్ వినిపిస్తోంది. ఇది మ్యూచువల్ గా ఇరువర్గాలకు కలిసొచ్చే అంశమే. ఎపిసోడ్ టీఆర్పీపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి.
తొలి టీజర్ తోనే తారక్ మెరుపులు
చక్కని విజ్ఞానం ప్రతిభ ఉండి అవకాశాలు రాని వారెందరో. సంపాదన మార్గం తెలియక పేదరికంలోనే ఉండిపోతారు. అలాంటి వారికి దండీగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇదిగో..ఆట నాది కోటి మీది! అంటూ ఊరిస్తూ.. ఇఎంకే టీజర్ ప్రేక్షకాభిమానుల ముందుకు తెస్తూ యంగ్ యమ ఎన్టీఆర్ వదిలిన బాణం యూత్ కి బాగానే గుచ్చుకుంది. జెమినిలో ఈ సరికొత్త షో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. స్టార్ మాలో మీలో ఎవరు కోటీశ్వరుడు(ఎంఇకే)?.. బిగ్ బాస్ సీజన్ లను టాప్ టీఆర్పీలో నిలబెట్టిన తారక్ పైనే ఈసారి జెమిని చానెల్ ఆశలు పెట్టుకుంది.
ఎంఈకే కి సారూప్యతలు ఉన్న ఇఎంకే(మీలో ఎవరు కోటీశ్వరుడు?) కార్యక్రమంతో టీఆర్పీ వేటలో పడింది సదరు ఎంటర్ టైన్ మెంట్ చానెల్. ఇంతకుముందు రిలీజ్ చేసిన వరుస టీజర్ లు తారక్ అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. ఎవరు మీలో కోటీశ్వరులు (ఇఎంకె) తొలి సీజన్ జనాల్లో ఉత్కంఠ పెంచుతోంది. ప్రోమోలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ క్విజ్ షోకి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
ఎన్‌టిఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగించి కొరటాల దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడితోనూ పని చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.. తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.