Begin typing your search above and press return to search.

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి.. అది బన్నీకి టన్నుల్లో ఉంది

By:  Tupaki Desk   |   19 Sep 2022 5:08 AM GMT
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి.. అది బన్నీకి టన్నుల్లో ఉంది
X
శ్రీవిష్ణు తాజా చిత్రం అల్లూరి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొనడంతో సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. మొన్నటి వరకు అల్లూరి గురించి కొద్ది మందిలో మాత్రమే చర్చ జరిగింది. ఇప్పుడు అల్లూరి గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో హీరో శ్రీ విష్ణు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒక చిన్న నటుడిని పిలిచి కెరీర్ గురించి అల్లు అర్జున్ ఇచ్చిన గైడెన్స్ కి ప్రతి ఒక్కరు కూడా నిజంగా బన్నీ గ్రేట్‌ అంటూ అభినందిస్తున్నారు. పెద్దగా పరిచయం లేని వ్యక్తిని... ఇండస్ట్రీ కి సంబంధం లేని వ్యక్తిని పిలిచి నీకు నేను ఉన్నాను అంటూ హామీ ఇవ్వడం కేవలం బన్నీ కే చెల్లిందని అభిమానులు అంటున్నారు.

అల్లు అర్జున్ గురించి హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... నా మొదటి సినిమా విడుదల అయిన సమయంలో రేసుగుర్రం షూటింగ్‌ లో ఉన్న బన్నీ గారు పిలిచారు అంటూ కబురు వచ్చింది. ఆ సమయంలో నన్ను స్నేహితులు ఆట పట్టిస్తున్నారు అనుకున్నాను. కానీ నాకు అల్లు అర్జున్ గారి నుండి నిజంగానే కాల్‌ వచ్చిందని.. ఆయనను చూసిన తర్వాత షాక్ అయ్యాను.

ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నన్ను అభినందించారు. నా నటనకు నా టైమింగ్‌ కు ఆయన నుండి పొందిన కామెంట్స్ ఆనందం కలిగించాయి. ఆ సమయం లోనే ఆయన మాట్లాడుతూ.. నువ్వు మంచి పాత్ర చేశావు. ఇప్పటికే నీకు అలాంటి పాత్రలు వరుసగా వస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఆ సినిమాలకు ఒప్పుకోకు అంటూ నాతో అన్నారు. అదేంటి సినిమాలు ఒప్పుకోవద్దు అంటున్నారని అనుకున్నాను.

ఆయన భవిష్యత్తును ముందుగానే ఊహించి రాబోయే నాలుగు అయిదు సంవత్సరాల్లో కంటెంట్‌ ప్రాముఖ్యత ఉన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయి. అలాంటి సినిమాలు మాత్రమే చేయి అన్నాడు. కథ మంచిగా ఉంటేనే సినిమా చేయమంటూ ఆయన నాకు చెప్పింది చెప్పినట్లుగా నేను పాటిస్తున్నాను.. అందుకే ఈ స్థాయిలో ఉన్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

నువ్వు మంచి కథలతో సినిమా చేయి.. నీకు ఇండస్ట్రీలో ఎవరు లేరు అనుకోకు. నీకు నేను ఉన్నాను, ఏ సమయంలో అయినా నా సహాయం నీకు ఉంటుంది. నా ఇంటి తలుపులు తడితే తప్పకుండా నీకు సహాయం చేస్తాను అన్నట్లుగా ఆ సమయంలో బన్నీ గారు హామీ ఇచ్చారు.

మాటలు ఎవరైనా ఇస్తారు.. హామీలు ఎవరైనా ఇస్తారు.. కానీ వాటిని నిలబెట్టుకునే దమ్ము కొందరికి మాత్రమే ఉంటుంది. అది మన బన్నీ గారికి టన్నులకు టన్నులు ఉందంటూ అభిమానులను ఉత్సాహ పర్చే విధంగా శ్రీ విష్ణు వ్యాఖ్యలు చేశాడు. ఒక చిన్న హీరో సినిమా కు అల్లు అర్జున్ ఇలా హాజరు అవ్వడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా బన్నీని ప్రశంసిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.