Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్‌ : ఇక్క‌డ విల‌న్స్ వుండ‌రు..హీరో మాత్రం పోలీస్‌

By:  Tupaki Desk   |   16 Sep 2022 12:17 PM GMT
ట్రైల‌ర్ టాక్‌ : ఇక్క‌డ విల‌న్స్ వుండ‌రు..హీరో మాత్రం పోలీస్‌
X
శ్రీ‌విష్ణు న‌టించిన లేటెస్ట్ ప్రెస్టీజియ‌స్ మూవీ `అల్లూరి`. మ‌ల‌యాళ న‌టి క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ల‌క్కీ మీడియా బ్యాన‌ర్ పై బెక్కం వేణు గోపాల్ ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబ‌ర్ 23న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేసింది.

రీసెంట్ గా హీరో శ్రీ‌విష్ణు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌మోష‌న్స్ కోసం ప్ర‌త్యేకంగా ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని హీరో నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. `జీవితంలో ఏదైనా సాధించాల‌నుకున్న వాళ్లు ఓ ల‌క్ష్యం పెట్టుకుంటారు.. ల‌క్ష్యం పెట్టుకోవ‌డం పెద్ద విష‌యం కాదు.. కానీ ఆ ల‌క్ష్యం కోసం జ‌రిపే పోరాటం వుంది చూశావా? అది అద్భుతం` అంటూ త‌నికెళ్ల భ‌ర‌ణి .. శ్రీ‌విష్ణుతో చెబుతున్న ఇన్స్ పిరేషన‌ల్‌ డైలాగ్స్ తో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ మొద‌లైంది.

శ్రీ‌విష్ణు ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆ పాత్ర‌ని ప‌రిచం చేస్తూ నేర‌స్తుల‌ని ప‌ట్టుకోవ‌డంతో అత‌నిది ప్ర‌త్యేక స్టైల్ అని చూపించారు. కేసుల‌ని డీల్ చేయ‌డంలో అల్లూరి స్టైల్ సెప‌రేట్‌.. న్యాయం కోసం వేరే దారి లేన‌ప్పుడు హింస‌ని ఆశ్ర‌యిస్తుంటాడు. ఈ క్ర‌మంలో న‌క్స‌లైట్లు, నేర‌స్తుల్లో మార్పుని తీసుకొస్తాడు. పోలీస్ ఉద్యోగం కోసం త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా ప‌నంగా పెట్టిన అల్లూరి కి ఎదురైన అడ్డంకులేంట‌న్న‌దే ఈ సినిమా.

ట్రైల‌ర్ లో `ఇక్క‌డ విల‌న్స్ వుండ‌రు..హీరో మాత్రం పోలీస్‌..` అంటూ శ్రీ‌విష్ణు చెప్పిన డైలాగ్ లు అల్లూరి పాత్ర ఎలా వుంటుందో స్ప‌ష్టం చేస్తున్నాయి. అల్లూరి సీతారామ‌రాజు స్ఫూర్తితో తెర‌కెక్కించిన ఈ మూవీని సెప్టెంబ‌ర్ 23న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ట్రైల‌ర్ ప్ర‌దీప్ వ‌ర్మ టేకింగ్‌, అత‌ని ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ని తెలియ‌జేస్తోంది. ఇంటెన్స్ కాప్ డ్రామా నేప‌థ్యంలో సాగిన ఈ మూవీకి `అర్జున్ రెడ్డి` ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

శ్రీ‌విష్ణు ప‌వ‌ర్ ఫుల్ కాప్ గా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేలా వున్నాడు. గ్రిప్పింగ్ యాక్ష‌న్ డ్రామాగా ఈ సినిమా వుండ‌బోతోంద‌ని ట్రైల‌ర్ తో స్ప‌ష్ట‌మౌతోంది. సెప్టెంబ‌ర్ 23న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 18న భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఛీప్ గెస్ట్ గా హాజ‌రు కానుండ‌టం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.