Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలో 'అల్లూరి' హీరో!

By:  Tupaki Desk   |   22 July 2022 11:30 AM GMT
ఆసుపత్రిలో అల్లూరి హీరో!
X
టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న శ్రీవిష్ణు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హీరోయిజం చూపించే పాత్రలు కాకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టే పాత్రలు.. కథకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు చేసిన శ్రీ విష్ణు ఇటీవల 'భళా తందనాన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమా కమర్షియల్ ఫలితం తో సంబంధం లేకుండా శ్రీవిష్ణు కు మంచి పేరు ను తెచ్చి పెట్టింది. ఇప్పుడు అల్లూరి అనే సినిమా లో శ్రీ విష్ణు నటిస్తున్నాడు.

షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలోనే శ్రీవిష్ణు అనారోగ్యం పాలవ్వడంతో షూటింగ్ నిలిచి పోయినట్లుగా సమాచారం అందుతోంది.

డెంగ్యూ బారిన పడ్డ శ్రీ విష్ణు ప్రస్తుతం ప్లేట్‌ లెట్స్ పడిపోవడంతో అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. హైదరాబాద్‌ లోని ప్రముఖ ఆసుపత్రిలో శ్రీవిష్ణు కు చికిత్స అందుతుందట.

యంగ్‌ హీరోగా ఎంతో మంది స్నేహం ను దక్కించుకున్న శ్రీ విష్ణు అనారోగ్య సమాచారం తెలిసి పలువురు టాలీవుడ్‌ వర్గాల వారు ఫోన్ ద్వారా ఆరోగ్య సమాచారం ను తెలుసుకుంటున్నారట.