Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్..పోలీస్ బ‌య‌ల్దేరాడు!

By:  Tupaki Desk   |   4 July 2022 6:27 AM GMT
టీజ‌ర్ టాక్ : ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్..పోలీస్ బ‌య‌ల్దేరాడు!
X
విభిన్న‌మైన క‌థ‌ల‌తో సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు యంగ్ హీరో శ్రీ‌విష్ణు. ఇటీవ‌లే 'భ‌ళా తంద‌నాన' వంటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ హీరో ప్ర‌స్తుతం బ్యాక్ కు బ్యాక్ స‌రికొత్త చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అయిపోతున్నారు. శ్రీ‌విష్ణు న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'అల్లూరి'. ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఓ సిన్సియ‌ర్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ బ‌యోపిక్ గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

'నిజాయితీకి మారుపేరు'అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్‌. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బెక్కెం బ‌బిత స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్కీ మీడియా బ్యాన‌ర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు కెరీర్ లోనే ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ టీజ‌ర్ ని 'ఫ‌స్ట్ వారెంట్' పేరుతో మేక‌ర్స్ సోమ‌వారం విడుద‌ల చేశారు. సినిమాలో హీరో శ్రీ‌విష్ణు ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

'ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్.. పోలీస్ బ‌య‌ల్దేరాడ్రా.. అనే వాయిస్ తో టీజ‌ర్ మొంద‌లైంది. త‌ను వ‌స్తున్నాడ‌ని తెలిసిన దొంగ‌లు, క్రిమిన‌ల్స్ ఎక్క‌డిక‌క్క‌డ పారితోతుండ‌టం.. అడ‌విలో వున్న న‌క్స‌ల్స్ ద‌గ్గ‌రికి వెళ్లి నాపేరు అల్లూరి సీతారామ‌రాజు.. నేను ఎస్ ఐని అంటూ పరిచ‌యం చేసుకోవ‌డం.. దాంతో అంతా చుట్టూచేరి గ‌న్స్ ఎక్కు పెట్ట‌డం.. సినిమాలో శ్రీ‌విష్ణు క్యారెక్ట‌ర్ కున్న గ‌ట్స్ ని తెలియ‌జేస్తోంది. విప్ల‌వానికి నాంది చైత‌న్యం.. చూత‌న్యానికి పునాది నిజాయితి.. అంటూ శ్రీ‌విష్ణు పాత్ర‌ని ఎలివేట్ చేసిన తీరు, అత‌న్ని చూసి విల‌న్ లు పారిపోతున్న సీన్ లు సినిమాలో శ్రీ‌విష్ణు పాత్ర‌ని ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా మ‌లిచారో స్ప‌ష్టం చేస్తోంది.

ఈ పాత్ర కోసం హీరో శ్రీ‌విష్ణు ట్రాన్స్ ఫార్మ్‌ అయిన విధానం ఆక‌ట్టుకుంటోంది. ఫ‌స్ట్ లుక్ నుంచే అంచ‌నాలు పెంచేసిన ఈ మూవీ టీజ‌ర్ తో ఆ అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచేసి మూవీపై మరింత బ‌జ్ ని క్రియేట్ చేస్తోంది. శ్రీ‌విష్ణు పాత్ర‌ని ఎలివేట్ చేసిన తీరు, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ అందించిన నేప‌థ్య సంగీతం సినిమా మూడ్ ని మ‌రింత ఎలివేట్ చేస్తోంది. అన‌ఫీషియ‌ల్ బ‌యోపిక్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఓ గ్రిప్పింగ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

నిజాయితీగ‌త ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ త‌న విస్త‌వాత్మ‌క‌మైన ఆలోచ‌న‌ల‌తో పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఎలాంటి మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాడు? ఎలా త‌న‌ముందున్న స‌వాళ్ల‌ని ఎదుర్కొన్నాడ‌న్న‌ది ఇందులో చూపించ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ల‌కు ఇదొక గ్రేట్ నివాళిగా వుండేలా ఈ ద‌ర్శ‌కుడు ప్లాన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా క‌యాదు లోహ‌ర్ న‌టించ‌గా, కీల‌క పాత్ర‌లో సుమ‌న్ క‌నిపించ‌నున్నారు. త‌నికెళ్ల‌భ‌ర‌ణి, మ‌ధుసూధ‌న్ రావు, ప్ర‌మోదిని, రాజా రవీంద్ర‌, పృథ్వీరాజ్‌, ర‌వివ‌ర్మ‌, జ‌య‌వాణి, ఆసు ఇంటూరి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నారు. రాజ్ తోట ఛాయాగ్ర‌హ‌ణం, ధ‌ర్మేంద్ర కాక‌రాల ఎడిటింగ్‌, వైట‌ర్ క‌ళా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఓ పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. శ్రీ‌విష్ణు కెరీర్ లో 'అల్లూరి'ఓ ప‌వ‌ర్ ఫుల్ మూవీగా నిలిచిపోవ‌డం ఖాయం అని తెలుస్తోంది.