Begin typing your search above and press return to search.

కందిరీగ కాన్సెప్ట్‌ తో అల్లుడు అదుర్స్‌

By:  Tupaki Desk   |   24 April 2020 3:45 AM GMT
కందిరీగ కాన్సెప్ట్‌ తో అల్లుడు అదుర్స్‌
X
ఆరంభంలోనే అదిరింది అనిపించుకునేందుకు భారీ బడ్జెట్‌ తో అల్లుడు శీను చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఆ తర్వాత కూడా అదే పద్దతిని కొనసాగించాడు. అయితే సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చినా కూడా నష్టాలు భారీగా ఉంటున్న కారణంగా భారీ బడ్జెట్‌ సినిమాలు ఇక వద్దనుకున్నారు. ప్రస్తుతం ఈయన అల్లుడు అదుర్స్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం కాన్సెప్ట్‌ గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అల్లు అదుర్స్‌ చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గా ఉంటుందట. గతంలో కందిరీగ చిత్రానికి సీక్వెల్‌ అంటూ వార్తలు వచ్చాయి. సీక్వెల్‌ కాకుండా కందిరీగ సినిమా కాన్సెప్ట్‌ నే కాస్త అటు ఇటుగా మార్చి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడట. కందిరీగ చిత్రంతో దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ కు మంచి మార్కులు పడ్డాయి. అందుకే అదే కాన్సెప్ట్‌ తో మళ్లీ సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను తీసినట్లుగా చెబుతున్నారు.

కందిరీగా సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో కూడా విలన్‌ హీరోయిన్‌ ను ప్రేమిస్తే ఆయనకు సెకండ్‌ హీరోయిన్‌ ను జత చేసి మొదటి హీరోయిన్‌ ను హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు. కామెడీ స్క్రీన్‌ ప్లేతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. కందిరీగ సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో కూడా విలన్‌ సోనూసూద్‌ నటిస్తున్నాడు. కాన్సెప్ట్‌ సేమ్‌ అయినా కూడా కామెడీ ఎలిమెంట్స్‌ కొత్తగా ఉండి స్క్రీన్‌ ప్లే కొత్తగా ఉంటే ఖచ్చితంగా మంచి స్పందన దక్కించుకోవడం ఖాయం. సక్సెస్‌ ఇచ్చిన కాన్సెప్ట్‌ ను నమ్మిక దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ కు ఈ సినిమా సక్సెస్‌ ను తెచ్చి పెడుతుందా చూడాలి.