Begin typing your search above and press return to search.

నెట్టింట అల్లుడు అదుర్స్ సందడి.. మరదళ్ళతో కలిసి అలా..!!

By:  Tupaki Desk   |   5 Jan 2021 10:45 AM GMT
నెట్టింట అల్లుడు అదుర్స్ సందడి.. మరదళ్ళతో కలిసి అలా..!!
X
యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో అల్లుడుశీను హిట్ అందుకున్నాక మళ్లీ అలాంటి హిట్ త్వరగా రాలేదు. అల్లుడుశీనుతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా.. ఆ తర్వాత చాలా సినిమాలకు బ్రేక్‌ లభించింది. అదే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయజానకి నాయక. కానీ చివరిగా నటించిన సస్పెన్స్ సైకో థ్రిల్లర్ ‘రాక్షసుడు’ మాత్రం ఈ బెల్లంకొండ వారసుడికి మంచి కంబ్యాక్ సూపర్ హిట్ అందించింది. ప్రస్తుతం ఈ అల్లుడుశీను.. కందిరీగ, హైపర్‌ సినిమాల దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసాడు. ‘అల్లుడు అదుర్స్‌’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులు ముమ్మరం చేశారు మేకర్స్. అయితే జనవరి 3న బెల్లంకొండ హీరో పుట్టినరోజు సందర్బంగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. 'హోలా చికా' అంటూ సాగే ఈ పాటలో శ్రీనివాస్ కౌబోయ్ గెటప్ లో డాన్స్ అదరగొట్టాడు. తాజాగా అల్లుడు అదుర్స్ కొత్త పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో హీరో శ్రీనివాస్ కి రెండు పక్కల చేతులలో చేయి వేసి నిలబడ్డారు హీరోయిన్స్. ఒకవైపు నభా నటేష్, మరోవైపు అను ఇమ్మానుయేల్. ముగ్గురు కూడా మంచి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇద్దరు మరదళ్ల మధ్య అల్లుడు నవ్వుతూ ఉన్నాడు. ఇక ఈరోజు 5:04 గంటలకు అల్లుడు అదుర్స్ ట్రైలర్ విడుదల చేయనున్నారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. చూడాలి మరి ట్రైలర్ లో ఎంత దమ్ముందో..!!