Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: కామెడీ యాక్షన్ సన్నివేశాలలో అదుర్స్ అనిపించుకుంటున్న 'అల్లుడు అదుర్స్'..!

By:  Tupaki Desk   |   5 Jan 2021 12:02 PM GMT
ట్రైలర్ టాక్: కామెడీ యాక్షన్ సన్నివేశాలలో అదుర్స్ అనిపించుకుంటున్న అల్లుడు అదుర్స్..!
X
యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''అల్లుడు అదుర్స్''. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. గంజి రమేష్ కుమార్ సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నభా నటేష్ - అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. 'బిగ్ బాస్' ఫేమ్ మోనల్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్.. తాజాగా 'అల్లుడు అదుర్స్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు.

''బేసిక్ గా కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్మాయిలంటే నాకు పడదు సర్.. లవ్వంటే నాన్సెన్స్ అని ఫీల్ అయ్యేవాడిని.. అలాంటిది మీ అమ్మాయి ఇంట్రడక్షన్ తో నా క్యారక్టర్ మొత్తం టర్న్ అయింది'' అంటూ ప్రకాష్ రాజ్ మెడకు కత్తి పెట్టి సాయి శ్రీనివాస్ హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అయింది. 'ఒక్క‌సారి నాదీ అనుకుంటే దాని కోసం ప్రాణం ఇస్తా.. జాన్ దేదూంగా' 'మొద‌టి దెబ్బ మ‌నం కొట్ట కూడ‌దు.. ఒక వేళ కొడితే రెండో దెబ్బ కొట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌కూడ‌దు' వంటి డైలాగ్స్ తో అల్లుడు శ్రీను క్యారక్టర్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో బెల్లంకొండ యాక్షన్ తో పాటు డ్యాన్సులు కూడా ఇరగదీసాడని అర్థం అవుతోంది. 'శీనుగాడు నా ఫ్రెండ్.. యాక్షన్ సీక్వెన్స్ లో వీడిది సెపరేట్ ట్రెండ్.. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ లేవమ్మా..' వంటి డైలాగ్స్ అలరిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఇది హారర్ కామెడీ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇందులో ప్రకాష్ రాజ్ - సోనూసూద్ - వెన్నెల కిషోర్ - సత్య - బ్రహ్మాజీ - సప్తగిరి ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. మొతం మీద ఈ 'అల్లుడు అదుర్స్' ట్రైలర్ ఆడియన్స్ అదుర్స్ అనేలా ఉంది.