Begin typing your search above and press return to search.
'అల్లుడు అదుర్స్' షూటింగ్ షురూ...!
By: Tupaki Desk | 21 Sep 2020 7:50 AM GMTయంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అల్లుడు అదుర్స్'. 'రాక్షసుడు' వంటి హిట్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'అల్లుడు అదుర్స్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేషమైన స్పందన వచ్చింది. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు ప్రకాష్ రాజ్ పై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
కాగా, 2021 సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కి ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లాకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్ - అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - సోనూసూద్ - వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఐటెం సాంగ్ లో అందాల విందు చేయనుందని సమాచారం. 'అల్లుడు అదుర్స్' చిత్ర టీజర్ ను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.